ఫోటో స్టొరీ: Jr. అతిలోక సుందరే.. డౌట్ లేదు

Update: 2019-09-09 16:46 GMT
అతిలోకసుందరి శ్రీదేవికి వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వి కపూర్. జాన్వి ఫస్ట్ ఫిలిం 'ధడక్' కమర్షియల్ గా ఒకే అనిపించుకుంది కానీ సినిమాపై విమర్శకులు పెదవి విరిచారు.  అయితే ఈ సినిమాలో జాన్వి నటనకు.. లుక్స్ కు మంచి మార్కులే పడ్డాయి.  ప్రస్తుతం రెండు మూడు ప్రాజెక్టులతో జాన్వి చాలా బిజీగా ఉంది. ఇక ఈ భామ న్యూ జెనరేషన్ స్టార్ కిడ్ కావడంతో హాట్ గా కనిపించడం అనే లక్షణం సహజంగా వచ్చేసింది.

జాన్వి జిమ్ము డ్రెస్సులు హైదరాబాద్ బిర్యాని అంత ఫేమస్ అని ఎవరైనా అంటే అందులో మరీ ఖండించాల్సినంత విషయమేమీ లేదు. ఇక జిమ్ము డ్రెస్సులే కాదు.. కవర్ పేజి ఫోటో షూట్లతో దుమ్ము దులపడంలో జాన్వి ఇప్పటికే స్పెషలిస్టుగా మారింది.  తాజాగా జాన్వి బ్రైడ్ టుడే మ్యాగజైన్ సెప్టెంబర్ సంచిక కవర్ పేజిపై మెరిసింది.  ఫోటోలో జాన్వి పింక్ కలర్ టాప్..  అదే కలర్ స్కర్ట్ ధరించి తన అందాలను ధారపోసింది. న్యాచురల్ గా అనిపించే మేకప్..  కరెక్ట్ గా సూటయ్యే యాక్సెసరీస్ ధరించింది.   చేతులకు బ్యాంగిల్స్ తో పాటు బ్లూ కలర్ ఫెదర్స్ ఉండే వెరైటీ రిస్ట్ బ్యాండ్స్ లాంటివి ధరించింది.  అందాల రాణి తరహాలో ఒక బ్యూటిఫుల్ ఎక్స్ ప్రెషన్ కూడా ఇచ్చింది. ఈ సోదంతా ఆపేసి ఒక్క ముక్కలో ఎలా ఉంది చెప్పాలి అంటే 'జూనియర్ అతిలోక సుందరి' లా ఉంది.

 ఈ ఫోటోకు కామెంట్లు అదిరిపోయాయి. "భోలీ సీ సూరత్".. "జూనియర్ చాందిని".. "క్యూటెస్ట్ బ్యూటీ".. "అమ్మకు తగ్గ కూతురు" అంటూ పొగిడారు.  ఇక జాన్వి సినిమాల విషయానికి వస్తే ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ 'గుంజన్ సక్సేనా' చిత్రంలో నటిస్తోంది.  ఈ సినిమా కాకుండా కరణ్ జోహార్ 'తఖ్త్' లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.


Tags:    

Similar News