రాంచరణ్ అల్లూరిగా నటించబోతున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో మరో స్టార్ హీరో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేస్తుండటం.. సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహిస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగాయి. ఈ సినిమా తర్వాత చరణ్.. సంచలన దర్శకుడు శంకర్‌తో ఓ పాన్ ఇండియా మూవీలో చేయబోతున్నట్టు ప్రకటించాడు.
అయితే ప్రస్తుతం శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్ -2 మధ్యలోనే ఆగిపోయింది. ఓ వైపు ఈ సినిమా వివాదం చెలరేగుతున్నది. అసలు శంకర్, చరణ్ కాంబోలోని సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు. ఇదిలా ఉంటే ఈ గ్యాప్‌లోనే జెర్సీ సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్నసూరితో .. చరణ్ ఓ సినిమా వస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఇరువర్గాలు అధికారికంగా ప్రకటించలేదు. అయినప్పటికీ సోషల్‌మీడియాలో ఈ వార్తలు వైరల్ అయ్యాయి.
తాజాగా ఈ విషయంపై గౌతమ్ క్లారిటీ ఇచ్చాడు. ‘ప్రస్తుతం నేను జెర్సీని హిందీలో రీమేక్ చేస్తున్నాను. ఆ పనిలో బిజీగా ఉన్నాను. ఏ తెలుగు హీరోకు ఇంతవరకు కథ చెప్పలేదు. కథలు కూడా నా వద్ద సిద్ధంగా లేవు’ అంటూ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో మెగా ఫ్యాన్స్‌కు షాక్ తగిలింది. జెర్సీ డైరెక్టర్ తో చరణ్ సినిమా ఉండబోతున్నదని వాళ్లు ఎంతో ఆశపడ్డారు. కానీ గౌతమ్ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లారు. మరోవైపు చరణ్ ఆచార్య సినిమాలో ఓ కీలక పాత్రలో మెరవబోతున్నారు. ఇక ఆర్ఆర్ ఆర్ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్, ఇటు నందమూరి అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.