ఫోటో స్టోరీ: శ్రీదేవి 2.0

Update: 2019-09-30 07:04 GMT
అతిలోకసుందరిగా ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్న శ్రీదేవికి వారసురాలిగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వి కపూర్. జాన్వి మొదటి సినిమా 'ధడక్' బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిచింది.. సినిమాకు కొంత మిశ్రమ స్పందన వచ్చినా జాన్వికి మాత్రం పాస్ మార్కులు పడ్డాయి.  ఆ సినిమా తర్వాత జాన్వికి మంచి ఆఫర్లే దక్కాయి.  సినిమాల్లో నటించడమే కాదు సోషల్ మీడియాను షేక్ చేయడం కూడా జాన్వికి ఆటోమేటిక్ గా వచ్చేసింది.  ఈ భామ న్యూ జెనరేషన్ స్టార్ కిడ్ కావడంతో ఫోటో షూట్లు.. ఫ్యాషన్ వేదికలపై క్యాట్ వాక్ లు.. కవర్ పేజిల మెరవడాలు చాలా కామన్.

ఏ అప్డేట్ ఉన్నా క్షణాల్లో తన ఇన్స్టా లో పోస్ట్ చేస్తుంది.  ఆ ట్రెండ్ కొనసాగిస్తూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది.  ఈ ఫోటోలకు "ఫ్రైస్ కోసం వేచి చూడడం అనేది సహజం" అని క్యాప్షన్ ఇచ్చింది.   నిజమే కదా.. ఎవరు ఎన్ని చెప్పినా ఆరోగ్యానికి హానికరం అని మొత్తుకున్నా వేపుళ్ళు అంటే జనాలు పడి చస్తుంటారు.  సలసలా కాగుతున్న  నూనెలో వేయించిన ఐటెమ్స్ అంటే భారతీయులకు మహా ప్రీతి.  ఎంత గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్ అయినా జాన్వి కూడా మనందరికీ ఉన్న అభిరుచులే ఉన్నాయని దీంతో అర్థం అవుతుంది.  ఇక డ్రెస్ విషయానికి వస్తే రెట్రో స్టైల్ లో కనిపిస్తోంది.  ప్రింటెడ్ కలర్స్ ఉండే ఫుల్ షర్ట్.. వెడల్పాటి కళ్ళజోడు.. పెద్ద ఇయర్ రింగ్స్.. చేతికి రిస్ట్ బ్యాండ్స్ తో పాత తరం హీరోయిన్ లా రెడీ అయింది. ఈ ఫోటోలు చూస్తే శ్రీదేవి గుర్తుకురాక మానదు.  అయితే ఈ జెనరేషన్ భామ కదా.. అందుకే వీలైనంత చిన్నారి పొన్నారి చిట్టి పొట్టి షార్ట్ ధరించి బేర్ లెగ్స్ తో హాట్ నెస్ ను రంగరించింది.  దీంతో ఈ ఫోటోలకు శ్రీదేవి 2.0 ఫీల్ తీసుకొచ్చింది.

ఈ ఫోటోలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కామెంట్లు కూడా అదిరిపోయాయి. "మా హృదయాలను ఫ్రై చేస్తున్నావు".. "జూనియరే కానీ హాట్నెస్ లో సీనియర్".. "సెక్సీ లెగ్.. ఫ్రై".. "జాన్వి ఆన్ ఫైర్" అంటూ పొగిడారు.  ఇక జాన్వి సినిమాల విషయానికి వస్తే ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ 'గుంజన్ సక్సేనా' చిత్రంలో నటిస్తోంది.  ఈ సినిమా కాకుండా కరణ్ జోహార్ 'తఖ్త్' లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

Tags:    

Similar News