టాలీవుడ్ లో ఎన్నో ఏళ్ళ తర్వాత మోస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ త్వరలో రెండో షెడ్యూల్ మొదలుపెట్టుకోనుంది. కార్తికేయ పెళ్లితో రాజమౌళి వినయ విధేయ రామ బాలన్స్ వర్క్ కోసం రామ్ చరణ్ ఇద్దరు బిజీగా ఉండటంతో ఫస్ట్ షెడ్యూల్ తర్వాత బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడా ఆ ఇద్దరి కమిట్మెంట్స్ పూర్తయ్యాయి కాబట్టి జక్కన్న వెంటనే రంగంలోకి దిగుతున్నాడు. అయితే బాహుబలి రెండు భాగాలకు నాలుగేళ్ళకు పైగా తీసుకున్న ఈ వెండితెర మాంత్రికుడు ఇప్పుడు ఏకంగా ఇద్దరు స్టార్లతో తీస్తున్నాడు కాబట్టి దీనికెంత టైం తీసుకుంటాడో అనే అనుమానం రావడం సహజం.
అయితే ఈ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ఒకే మాటగా రాజమౌళితో దీన్ని ఏడాదిలోపే పూర్తి చేయమని ఒత్తిడి చేస్తున్నారట. దానికి కారణం లేకపోలేదు. తారక్ చరణ్ లకున్న మార్కెట్ దృష్ట్యా ఏడాది కంటే ఎక్కువ గ్యాప్ మంచిది కాదు. ఇతర నిర్మాతలకు ఇచ్చిన కమిట్మెంట్స్ ఉంటాయి కాబట్టి అవి పూర్తి చేయడంతో పాటు కొత్త వాటి మీద దృష్టి పెట్టాలి. అలా కాకుండా కేవలం ఆర్ ఆర్ ఆర్ కోసమే రెండు మూడేళ్ళు బ్లాక్ అయిపోతే అవతల వెయిటింగ్ లిస్టు పెరిగిపోతుంది.
దానికి తోడు గ్యాప్ ఎక్కువయ్యే కొద్ది అభిమానుల అంచనాలు పెరుగుతూ పోతాయి. అది ఒకరకంగా ఆర్ ఆర్ ఆర్ మీదే ఒత్తిడి పెంచుతుంది. అలా కాకుండా ఏడాది లోపే అంటే ఇద్దరికీ సౌకర్యంగా ఉంటుంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం షూటింగ్ కు ముందే రాజమౌళి ఈ విషయమై ఇద్దరు హీరోలతో చర్చ చేసాడట. పక్కా ప్లానింగ్ తో రెండు మూడు యూనిట్లను ఒకేసారి ఎంగేజ్ చేసైనా సరే పూర్తి చేస్తానని చెప్పినట్టు సమాచారం. ఈ లెక్కన ఆర్ ఆర్ ఆర్ వచ్చే ఏడాది చూడటం ఖాయమే
Full View