టాలీవుడ్ లో ప్రెజెంట్ ఉన్న యువ హీరోల్లో డైలాగులు స్పష్టంగా చెప్పగల హీరో ఎవరని అడిగితే తడుముకోకుండా చెప్పగలిగే పేరు ఎన్టీఆర్..తాత ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ డైలాగ్ డెలివరీ విషయంలో మంచి పట్టుతో సినిమాల్లోకి అడుగుపెట్టాడతను. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో అతడి వాయిస్ కొంచెం తేడాగా ఉండేది కానీ వయసు పెరిగాక, అనుభవంతో డైలాగ్ డెలివరీలో తనకు తిరుగులేని తారక్ చాటుకున్నాడు. సినిమా సినిమాకూ తారక్ డైలాగ్ డెలివరీ మెరుగవుతూ వచ్చింది. తెలుగు పదాల్ని పలకడంలో.. పిచ్ పెంచడంలో, తగ్గించడంలో.. సన్నివేశం తాలూకు ఎమోషన్‌ను మాటల్లో సరిగ్గా క్యారీ చేయడంలో తారక్‌కు తారక్‌కు సాటే అని చాలాసార్లు రుజువైంది. అతని వాఖ్య ఉచ్చారణ చూస్తే అర్థం అవుతుంది అతనికి తెలుగు భాష మీద ఎంత పట్టుందో. ఇప్పుడు తారక్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ స్వాతంత్ర సమరయోధుడు 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.
'ఆర్ఆర్ఆర్' సినిమాలో తన డైలాగ్ డెలివరీ ఉండబోతున్నది అన్నదానికి చిన్న ఉదాహరణ నిన్న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన వీడియో టీజర్. ఈ వీడియోలో ఎన్టీఆర్ వాయిస్ విన్న ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకోక మానవు. తారక్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ వీడియోలో హీరోని ఎలివేట్ చేస్తూ డైలాగ్ చెప్పిన వైనం అమోఘం. అయితే తెలుగు టీజర్లో డైలాగ్ చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ తమిళం, హిందీ, కన్నడ భాషల్లోనూ తారక్ ఇదే రేంజిలో డైలాగ్ పేల్చిన వైనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా హిందీలో తారక్ తన వాయిస్‌లో బేస్‌ను ఇంకా పెంచి, పదాల్ని స్పష్టంగా పలుకుతూ ఇచ్చిన వాయిస్ ఓవర్ గురించి ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరుగుతోంది. బీటౌన్ జనాలు తారక్ టాలెంటుకి ఫిదా అయిపోతున్నారు. ఒక్క మలయాళంలో మాత్రమే తారక్ టీజర్‌కు వాయిస్ ఇవ్వలేదు. వాళ్ల యాసను అందుకోవడం చాలా కష్టం కాబట్టి దాని మాడ్యులేషన్లో చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క భాషకు తారక్ దూరంగా ఉన్నాడు. టీజర్లో తారక్ వాయిస్ విన్నాక అతను మిగతా భాషల్లోనూ సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.