స్టార్ హీరోయిన్ ఇన్ స్టాలోకి వచ్చేసింది

Update: 2018-06-29 11:09 GMT
ఈ రోజుల్లో అభిమానులతో సెలబ్రిటీలు టచ్ లో ఉండటానికి ఈజీ మెథడ్ సోషల్ మీడియా. తమ అభిమాన తారలు చెప్పే విశేషాల కోసం ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాను బాగానే ఫాలో అవుతుంటారు. అందుకే చిన్న పాత్రలు వేసే నటుల దగ్గర నుంచి టాప్ రేంజ్ హీరో.. హీరోయిన్ల వరకు సోషల్ మీడియాలో అకౌంట్లు తెరిచి ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు.

ఈ విషయంలో కొందరు స్టార్లు మాత్రం ఇంకా సోషల్ మీడియాలోకి ఎంటరవడానికి ఇష్టపడటం లేదు. టాప్ రేంజి యాక్టర్లు కొందరు ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో అడుగుపెడుతున్నారు. హాలీవుడ్ సినిమాలు ఇష్టపడే వారందరికీ టాప్ స్టార్ జూలియా రాబర్ట్స్ సుపరిచితురాలే. ఆస్కార్ అవార్డ్ విన్నర్ అయిన ఈ హీరోయిన్ కు ఇంతవరకు సోషల్ మీడియాలో ఎంటరవలేదు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేసింది. నీరెండలో చెట్టు కింద కూర్చుని బ్లాక్ టీ షర్ట్ వేసుకుని చిరునవ్వలు చిందిస్తూ ఉన్న ఫొటోను షేర్ చేసింది. దీనికింద అందరికీ హలో చెబుతూ సన్ షైన్ ఎమోజీని యాడ్ చేసింది.

జూలియా రాబర్ట్స్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమాన గణానికి ఏమీ తక్కవ లేరు కదా. అందుకే ఆమె ఫొటో షేర్ చేసిన గంటల్లోనే లక్షల్లో లైకులు వచ్చి పడ్డాయి. వందలాది మంది ఆమెకు ఇన్ స్టాగ్రామ్ లోకి వెల్ కం చెప్పారు. మొత్తానికి కొంచెం లేట్ గా అయినా జూలియా రాబర్ట్స్ ట్రెండ్ బాట పట్టింది.  


Tags:    

Similar News