#కాజల్.. ఈ నిస్స‌హాయ స్థితిలో ఒత్తిడిని జ‌యించేందుకు..!

Update: 2021-05-01 03:20 GMT
క‌రోనాతో ప్ర‌పంచం క‌కావిక‌లం అవుతోంది. దేశానికి ర‌క్త‌స్రావం అవుతోంది. ఇలాంటి ప‌రిస్థితిలో ప్ర‌జ‌లు మాన‌సిక ఒత్తిడిని జ‌యించాలంటే ఏం చేయాలి? అందుకు స‌రైన సొల్యూష‌న్ ప్ర‌జ‌లంతా నియ‌మ‌నిబంధ‌న‌లు పాటిస్తూ త‌మ ప‌నుల్లో ఉండాల‌ని ఇంట్లోనుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌కుండా చిన్నా చిత‌కా ప‌నులు చేస్తూ గ‌డ‌పాలని కాజ‌ల్ అగ‌ర్వాల్ సూచిస్తున్నారు.

ఈ భయంకరమైన పరిస్థితిలో విశ్రాంతి తీసుకోవడానికి కాజల్ అగర్వాల్ త‌న ఇంట్లో కుటుంబ స‌భ్యుల‌తో గ‌డుపుతున్నారు. తీరిక స‌మ‌యాన్ని అల్లిక‌లు కుట్ల‌తో స్పెండ్ చేస్తున్నారు. ఇలా చేయ‌డం ద్వారా ఈ నిస్స‌హాయ స్థితిలో మాన‌సిక ఒత్తిడిని జ‌యించ‌వ‌చ్చ‌ని చంద‌మామ కాజ‌ల్ చెప్ప‌క‌నే చెబుతున్నారు.

ఇది నిజంగా గొప్ప‌ చికిత్సా విధానం.. సెలబ్రిటీలు తమ సూచ‌న‌ల‌తో పాజిటివిటీని వ్యాపింప‌జేయ‌డానికి ప్రయత్నిస్తున్నారు. అందాల చంద‌మామ‌ కాజల్ అగర్వాల్ ఇటీవల ఆమె ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటున్నారో భయంకరమైన పరిస్థితిని ఉత్తమమైన రీతిలో షేర్ చేస్తున్నారు.

కోవిడ్ 19 మహమ్మారి రెండవ వేవ్ కారణంగా దేశం నెమ్మదిగా లాక్ డౌన్ మోడ్ కు వెళుతోంది. ఏదేమైనా ఈ క్లిష్ట పరిస్థితిలో భయాందోళనలకు గురికాకుండా ఒకరికొకరు సహాయపడటానికి భారతదేశం అంతటా ఉన్న ప్రముఖులు ప్రజలు తమ వంతు కృషి చేస్తున్నారు. అలాగే ప్రముఖులు పాజిటివిటీని పెంచ‌డానికి గతంలో కంటే ఆనందకరమైన విషయాలను పోస్ట్ చేయడం కనిపిస్తుంది. ఇతరుల్లో పాజిటివిటీ నింప‌డం కోసం ఏదైనా సృష్టించడం స‌రైన‌ చికిత్సా విధానం అని కాజ‌ల్ అన్నారు.

కాజల్ అగర్వాల్ ఒక  సూది తీసుకుని నూలు రోల్ తో అల్లిక‌ల‌ను ప్ర‌య‌త్నిస్త‌న్నారు. సూది- రోల్ ఫోటోను సోష‌ల్ మీడియాల్లో షేర్ చేశారు. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. మన చుట్టూ నిస్సహాయత  ఆందోళన క‌నిపిస్తోంది. మన మనస్సులను ఏదో ఒక ప‌నిపై కేంద్రీకరించడం చాలా ముఖ్యం. అది ఏదైనా కావచ్చు- ఆలోచన ఉద్దేశపూర్వకంగా లేదా సృజనాత్మకంగా అనుభూతి చెందడం ఈ స‌మ‌యంలో అవ‌స‌రం. గెలుస్తాం అనే భావాన్ని ఏర్పరచాలి. నేను ఇటీవల అల్లిక‌లు చేస్తున్నా. ఇది నాకు విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇది మానసిక క్షేమానికి సహాయపడుతుంది! ఇతరుల కోసం ఏదైనా సృష్టించడం నిజంగా చికిత్సా విధానం! మీ ఖాళీ సమయంలో ఇంట్లో ఉండి మీరు ఏమి చేస్తున్నారు? అంటూ వ్యాఖ్యానం జోడించారు.

గత వారం కాజల్ ఒక నోట్ రాశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థపై భారం పడకుండా తమ వంతు కృషి చేయాలని అభ్యర్థించారు. ప్రపంచం ప్రస్తుతం భయానక ప్రదేశం.. ఈ మహమ్మారి మనకు స్థితిస్థాపకత.. ఆరోగ్యం .. సహనాన్ని మనకు తెలియని మార్గాల్లో పరీక్షిస్తోంది. దీని ద్వారా మనం చేయగలిగినది.. మనల్ని కాపాడే శ‌రీరంలో అధికంగా పనిచేసే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు భారం కాకూడ‌దు. మ‌నం సాయ‌మ‌వ్వాలి! అంటూ చ‌క్క‌ని సందేశాన్ని ఇచ్చారు.
Tags:    

Similar News