కాజోల్ తెలుగు డెబ్యూ సాంగ్ స్టార్ట్

Update: 2016-04-27 22:30 GMT
బాలీవుడ్ బ్యూటీ కాజోల్.. దేశంలో చాలామంది కుర్రకారుకి కలల బ్యూటీ. ముఖ్యంగా 'దిల్వాలే దుల్హనియా లేజాయేంగే' తర్వాత.. ఈమెకు దేశవ్యాప్తంగా వీరాభిమానులు ఏర్పడిపోయారు. పాతికేళ్లుగా ఆ క్రేజ్ ని మెయింటెయిన్ చేస్తుండడం విశేషమే అయినా.. ఇంత సుదీర్ఘమైన టైంలో ఒక్కసారి కూడా తెలుగు తెరపై కనిపించలేదు కాజోల్. కానీ ఇప్పుడా ముహూర్తం వచ్చేసింది.

కాజోల్ తెలుగులో యాక్ట్ చేస్తున్న మాట నిజమే కానీ.. ఇది సినిమా కోసం కాదు. ఓ పాట కోసం.. అది కూడా ఆంధ్రప్రదేశ్ టూరిజం ప్రచారం కోసం  చిత్రీకరించనున్న పాటలో కాజోల్ నటించనుంది. ఏపీ టూరిజం ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు.. అజయ్ దేవగన్, కాజోల్ లను బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఇప్పుడో ప్రమోషనల్ సాంగ్ తీసేందుకు టూరిజం శాఖ రెడీ అయింది. ఈ సాంగ్ లో పాల్గొనాల్సిందిగా కాజోల్ ను కోరింది ఏపీ సర్కారు.

గతంలో గుజరాత్ కి అమితాబ్ బచ్చన్ ఇలాగే ప్రచారం చేసేవారు. ఇప్పుడు కాజోల్ చేయనున్న ప్రమోషన్ కూడా ఇలాంటిదే. అయితే.. కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా.. అమరావతిలో పెట్టుబడులు చేసేందుకు కూడా కాజోల్ జంట ముందుకు రావడం విశేషం. అలాగే రాజధానిలో ఎంటర్టెయిన్మెంట్ అండ్ మీడియా సిటీ అంటూ ఓ వినోద ప్రాంతాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా ఏపీ సర్కార్ రెడీ అవుతోంది.


Tags:    

Similar News