అవి చేస్తే జనాలు ఆఫర్స్ లేవనుకుంటారు!!

Update: 2020-07-06 08:10 GMT
మెగా ఫ్యామిలీ నుండి హీరోగా పరిచయం అయిన కళ్యాణ్ దేవ్ ప్రస్తుతం తన రెండవ సినిమా సూపర్ మచ్చి ని చేస్తున్నాడు. ఇటీవలే కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొన్నట్లుగా చెప్పుకొచ్చాడు. సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది. త్వరలోనే సినిమాను పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేస్తారనే వార్తలు వస్తున్నాయి. సినిమాను ఓటిటి ద్వారా విడుదల చేసే అవకాశం ఉందని ప్రచారం జరుతూ ఉంది.

ఇటీవల కళ్యాణ్ దేవ్ వెబ్ సిరీస్ లో నటించే విషయం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు వెబ్ సిరీస్ ల్లో నటించే ఆసక్తి లేదని చెప్పిన కళ్యాణ్ దేవ్ ఒకవేళ తనలాంటి అప్ కమింగ్ నటులు వెబ్ సిరీస్ లు చేస్తే జనాలు ఖచ్చితంగా ఆఫర్స్ లేకపోవడం వల్ల చేస్తున్నట్లుగా అనుకుంటారు. అదే స్టార్స్ చేస్తే మాత్రం వారి గురించి పెద్దగా పట్టించుకోరు. అందుకే స్టార్స్ వెబ్ సిరీస్ చేస్తున్నా కూడా కొత్త హీరోలు వెబ్ సిరీస్ ల వైపు ఆసక్తి చూపడం లేదని అభిప్రాయపడ్డాడు. మొత్తానికి కళ్యాణ్ దేవ్ వెబ్ సిరీస్ ల్లో నటించే ఆసక్తి లేదని తేల్చి చెప్పారు.
Tags:    

Similar News