కొండ చిలువలాంటోడితో 24గంటలు

Update: 2015-09-02 20:15 GMT
అలా మొదలైంది తర్వాత రంజిత్‌ మూవీస్‌ లో ఇది నాకు మూడో సినిమా. మొదటిసారి తేజతో పనిచేశా. హోరా హోరీ గొప్ప అనుభవం. ఇక ఎప్పటికీ తేజతో పనిచేయనేమో! అంటూ నవ్వేస్తున్నాడు కళ్యాణ్‌ కోడూరి. ఆయనకి కోపం, నాకూ ముక్కోపం. అందుకే ఇద్దరిమధ్యా బోలెడన్ని గొడవలయ్యాయి. మధ్యలో వదిలేసి వచ్చేశా. అయినా మళ్లీ ఎందుకనో కలిసిపోయి చివరికి ఎలాగోలా సినిమా పూర్తి చేసేశాం ..అంటూ వింతైన అనుభవాల్ని చెప్పుకొచ్చాడు కోడూరి. హోరా హోరీ ఈనెల 11న రిలీజవుతోంది. ఈ సందర్భంగా కళ్యాణ్‌ కోడూరి చెప్పిన సంగతులివి...

=తేజ కొండ చిలువ లాంటోడు. అతడి వర్కింగ్‌ స్టయిల్‌ డిఫరెంట్‌. సంగీత దర్శకుడు 24గంటలు తనతోనే ఉండాలంటాడు. అది నేను తట్టుకోలేకపోయేవాడిని. కోపంలో తిట్టుకున్నాం. వదిలి వెళ్లిపోయా. మళ్లీ కలిసిపోయాం. ఇక పనిచేయనేమో అనుకుంటున్నా. కానీ చెప్పలేను..

=తేజ పాటను అడిగే సందర్భాలు డిఫరెంట్‌. 'కట్‌ చేస్తే పాట' అన్నట్టే ఉంటుంది. ఓసారి చచ్చిపోవాలని ఉంది అనే పదంపై పాట ఇవ్వమన్నాడు. రైళ్లలో డప్పు కొట్టుకుంటూ అడుక్కుంటారు. ఆ పాట చెయ్‌ అన్నాడు. రెండు నిమిషాల్లో సిద్ధం చేశా. ఇది హిట్టే, చూసుకునే పనిలేదన్నాడు. తేజ పాట విషయంలో ఎంతో స్వేచ్ఛనిస్తారు. ఎదుటివారి ఆలోచనలకు గౌరవమిస్తాడు. కోపం వచ్చినప్పుడే .. కాస్తంత దూరం.

=నన్ను ట్యూన్‌ చేసేది డబ్బే. బాగా బతకాలి. నా కుటుంబం రిచ్‌ గా ఉండాలి. బాధ్యతలకు భయపడి దూరంగా వెళ్లిపోనంత డబ్బు కావాలి. అందుకే సంగీతం అందిస్తున్నా.

=హిట్టొచ్చినా ఏడాదికో సినిమానే. దానికే అలవాటు పడిపోయా. అలా మొదలైంది తర్వాత ఏడాది ఖాళీ. హోరా హోరీ తో అయినా నా నిరీక్షణ ఫలిస్తుందేమో!

Tags:    

Similar News