పటాస్ తో బంపర్ కమర్షియల్ హిట్ కొట్టినప్పటికీ తర్వాత ఆ స్థాయి సక్సెస్ అందుకోలేక ఇబ్బంది పడుతున్న నందమూరి కళ్యాణ్ రామ్ మార్చ్ 1న విడుదల కాబోయే 118 మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. మొదటి సారిగా థ్రిల్లర్ జానర్ ట్రై చేసాడు. మసాలా అంశాలకు దూరంగా కేవలం రెండే పాటలతో ఇది రూపొందటం ఇప్పటికే ఆసక్తిని రేపుతోంది. ట్రైలర్ కూడా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. దీని ప్రమోషన్ లో చురుగ్గా పాల్గొంటున్న కళ్యాణ్ రామ్ త్వరలో వెబ్ సిరీస్ తీస్తానని చెబుతున్నాడు. ఎవరితో ఎప్పుడు ఎలా అనే వివరాలు చెప్పలేదు కాని డిజిటల్ కంటెంట్ కు పెరుగుతున్న ఆదరణ కళ్యాణ్ రామ్ ని ఆకర్షించినట్టు ఉంది.
ప్రిన్స్ మహేష్ బాబు అందరి కన్నా అడ్వాన్సుగా ఇప్పటికే స్క్రిప్ట్ ఫైనల్ చేసి చార్లీ అనే సిరీస్ ని మొదలుపెట్టబోతున్నాడు. సుధీర్ బాబు హీరోగా చేస్తాడనే టాక్ ఉంది. ఈ పనులలోనే మహర్షి కొంత లేట్ అయ్యిందనే టాక్ ఫిలిం నగర్ చక్కర్లు కొడుతూనే ఉంది. సో ఇప్పుడు కళ్యాణ్ రామ్ కూడా చెబుతున్నాడు అంటే మన హీరోలు ఒక్కొక్కరుగా వెబ్ సిరీస్ ల మీద మనసు పారేసుకుంటున్నారని అర్థమైపోతోంది.
తక్కువ బడ్జెట్ తో పాటు విడుదల విషయంలో ఎలాంటి వ్యయం ఉండకపోవడం వీటికున్న ప్రధాన ఆకర్షణ. ఇవి అందించే వెబ్ సైట్స్ చందాదారులు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా చూస్తారు కాబట్టి కంటెంట్ సాలిడ్ గా ఉంటే చాలు హిట్టు గ్యారెంటీ. పేరు వచ్చిందా ఆటోమేటిక్ గా డబ్బులు వచ్చి పడతాయి.
అమెజాన్ ప్రైమ్ ఒక్కో వెబ్ సిరీస్ కు 2 నుంచి 3 కోట్ల దాకా పెట్టేందుకు వెనుకాడటం లేదు. బాహుబలి శివగామి సిరీస్ వెనుక నెట్ ఫ్లిక్స్ లాంటి డిజిటల్ దిగ్గజం ఉంది. ఈ పరిణామాలన్నీ చూస్తే భవిష్యత్తులో ఇంకొందరు వీటి వైపు ఆకర్షితులు కావడం ఖాయం. సంవత్సరం క్రితమే అమెజాన్ జగపతి బాబు ప్రధాన పాత్రలో గ్యాంగ్ స్టార్స్ అనే వెబ్ సిరీస్ వదిలింది. మహేష్ కళ్యాణ్ రామ్ ల స్ఫూర్తితో ఇంకెందరు వస్తారో లెట్ వెయిట్ అండ్ సీ