ఈ మధ్యన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తరచూ ఉత్తరాది.. దక్షిణాది మాటలు మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఉత్తరాది అహంకారం అంటూ ఆయన చేసే వ్యాఖ్యలకు తగ్గట్లే ఈ మధ్యన పరిణామాలు చోటు చేసుకోవటం గమనార్హం. ఈ మధ్యన వెయ్యి కోట్ల ప్రాజెక్టు అయిన మహాభారత మూవీ హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. ఇందులో కీలకపాత్రను మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ చేస్తుండటం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రకటించిన వెంటనే.. బాలీవుడ్ కి చెందిన నటుడు.. నిర్మాత.. విమర్శకుడిగా చెప్పుకుంటూ అప్పుడప్పుడు నోటి తీట తీర్చుకునే కమల్ ఆర్ ఖాన్ ట్వీట్లతో వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.
మోహన్ లాల్ ను ఛోటా భీమ్ గా అభివర్ణిస్తూ.. అతడ్ని భీముడి క్యారెక్టర్ కి ఎలా ఎంపిక చేస్తారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెయ్యి కోట్ల సినిమాలో ఛోటాభీమ్ ను ఎలా తీసుకుంటారంటూ అతగాడి బలుపు మాటలు మోహన్ లాల్ ఫ్యాన్స్ ను తీవ్ర ఆగ్రహానికి గురి చేశారు. ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడిన మోహన్ లాల్ ఫ్యాన్స్ మీదా కమల్ మరింతగా రెచ్చిపోయాడు.
ఈ ఎపిసోడ్ ఇలా సాగుతుంటే.. మోహన్ లాల్ మాత్రం ఎలాంటి రియాక్షన్ ఇవ్వకుండా హుందాగా వ్యవహరిస్తూ.. కామ్‌గా ఉండిపోయారు. మోహన్ లాల్ ఫ్యాన్స్ విమర్శలపై మరింత విరుచుకుపడుతూ.. ట్విట్టర్లో తనను ఫాలో అయ్యే వారితో పోలిస్తే.. మోహన్ లాల్ కు ఫాలోయర్లు తక్కువని.. తాను మోహన్ లాల్ కంటే మరింత పెద్ద నటుడినంటూ చేసిన వ్యాఖ్యలు మరింత అగ్గి రాజేసేలా చేశాయి. పుండు మీద కారం చల్లినట్లుగా తమ అభిమాన కథానాయుడిపై కమల్ చేస్తున్న వ్యాఖ్యలపై మోహన్ లాల్ ఫ్యాన్స్ అగ్గి ఫైర్ అయ్యారు.
ఇదిలా ఉంటే.. తాజాగా కమల్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. మోహన్ లాల్ పై తాను చేసిన ఛోటాభీమ్ వ్యాఖ్యలపై క్షమాపణలు కోరటమే కాదు.. ఆయనెంత పెద్ద నటుడన్న విషయం తనకు తెలిసిందని.. ఆయన్ను ఛోటాభీమ్ అంటూ తాను సంబోధించిన తీరుపై సారీ కోరారు. తనకు మోహన్ లాల్ గురించి పెద్దగా తెలీదని.. కానీ తనకిప్పుడు మోహన్ లాల్ మలయాళం సూపర్ స్టార్ అన్న విషయం తెలిసిందంటూ చెంపలేసుకునే కార్యక్రమాన్ని షురూ చేశారు. అవగాహన లేకుండా.. ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తూ.. లక్షలాది మందిని హర్ట్ చేస్తున్న కమల్ వ్యవహారం ఎగువ భారతంలోని వారి అహంకారం ఖాతాలో వేసుకోవాలా? లేక.. అతగాడి అవగాహనరాహిత్యం లెవెల్స్ ఎంతో తెలుసుకొని.. ఇలాంటి వారిని లైట్ తీసుకోవాలా? అన్నది మరో ప్రశ్న. అయినా.. పూర్తిగా తెలుసుకోకుండా ఇష్టారాజ్యంగా ట్వీట్స్ చేసి పారేసే వారిని ఏం చేయాలి? ఇంతమంది మనోభావాల్ని దెబ్బ తీసినోళ్లు.. అనాల్సిన మాటలన్నీ అనేసి.. తర్వాత తీరిగ్గా సారీ చెబితే సరిపోతుందా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/