సోషల్ మీడియాలో క్రిటిక్స్ చాలా ఎక్కువైపోయారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇతర విషయాల గురించే కాకుండా వ్యక్తిగత విషయాలపై కూడా విమర్శలు చేసి క్రిటిక్ అని పేరు పెట్టుకోవడం ఫ్యాషన్ అయ్యింది. ఆ సంగతి పక్కనపెడితే.. గత కొంత కాలంగా క్రిటిక్ అనే పదానికి మరో అర్దాన్ని చెప్పిన వ్యక్తి కేఆర్కే. కమల్ ఆర్ ఖాన్ అనే ఈ బాలీవుడ్ ప్రొడ్యూసర్ అమితాబ్ బచ్చని పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ పై విమర్శలు చేశాడు.
అలాగే బాహుబలి 2 సినిమా చెత్తలా ఉందని చెప్పాడు. ఆ తరువాత ఆ సినిమా కలెక్షన్స్ చూసి సినిమాను పొగిడేశాడు. చాలా వరకు అతని ట్వీట్స్ కి పిచ్చెక్కిపోయిన జనాలు అతని ట్విట్టర్ అకౌంట్ ని బ్లాక్ చేశారు. దీంతో ట్విట్టర్ కూడా అతని ఎకౌంట్ ని పర్మినెంట్ గా డిలీట్ చేసింది. ఇకపోతే అతను రీసెంట్ గా మరో ఎకౌంట్ ద్వారా ఎవరు ఊహించని విధంగా ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. అదేమిటంటే అతని కడుపులో క్యాన్సర్ ఉందని చెప్పాడు. మరో రెండేళ్ల కంటే ఎక్కువ కాలం బ్రతకలేను. అది ఇప్పుడు థర్డ్ స్టేజ్ లో ఉందని చెప్పడంతో అందరు షాక్ అయ్యారు.
కేఆర్కే ఇలాంటి విషయాన్ని చెప్పడేంటని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. అలాగే తాను ఇక నుంచి ఎవరిని ఎంటర్టైన్ చేయలేనని త్వరలో చనిపోబోతున్నట్లు తెలిపాడు. అలాగే తన చివరి కోరికలను కూడా తెలిపాడు. మంచి నిర్మాతగా గుర్తింపు తెచ్చుకోవాలని ఉందని అమితాబ్ వంటి అగ్రనటులతో నటించాలని ఉందని చెప్పాడు. మిగిలిన ఈ కొన్ని రోజులు తన ఫ్యామిలీతో ఉంటానని కేఆర్కే వివరించాడు.