ఇక్కడ మాట్లాడుతోంది కమల్ హాసన్ అనే లెజెండ్ గురించి కాదు. కమల్ ఆర్.ఖాన్ అనే ముంబయి కుసంస్కారి గురించి. ఇతను ఎవరు అంటే.. బాలీవుడ్ జనాలు సోషల్ మీడియా జోకర్ అని చెబుతుంటారు. బాలీవుడ్లో ఒకటీ అరా బి-గ్రేడ్ సినిమాల్లో నటించిన ఈ కమల్.. సోషల్ మీడియాలో భలే యాక్టివ్ గా ఉంటాడులెండి. సోనాక్షి సిన్హా తొడల గురించి.. దీపికా పదుకొనే క్లీవేజ్ గురించి అడ్డమైన కామెంట్లు చేస్తుంటాడు. ఇలా మాట్లాడినందుకే సోనాక్షి ఓసారి అతడికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంది. ఐతే అతను కోరుకునేది కూడా ఇలాంటి అటెన్షనే. బాహుబలి మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో దాని గురించి మాట్లాడితే.. మంచి మైలేజీ వస్తుందనుకున్నాడేమో. అడ్డమైన కామెంట్లు చేశాడు. పనిలో పనిగా సౌత్ ఇండియన్ హీరోల గురించి, ఫ్యాన్స్ గురించి కూడా చెత్త కామెంట్లు చేశాడు. ట్విట్టర్లో అతనేమన్నాడో చూడండి.
‘‘మహేష్, పవన్ కళ్యాణ్ విజయ్.. వీళ్లందరూ సౌత్ ఇండియాలో పెద్ద స్టార్స్ అని ఎవరో చెప్పారు. వాట్ ఎ ఛాయిస్’’
‘‘సమంత రూత్ ప్రభు సౌత్ లో పెద్ద హీరోయిన్ అని విన్నాను. కానీ ఆమె దీపిక పదుకొనేకి హెయిర్ డ్రెస్సర్లా ఉంటుంది. మరెలా అంత పెద్ద హీరోయిన్ అయింది?’’
‘‘గాడిద సినిమా బాహుబలిని పక్కనబెట్టింది. సింహం సినిమా బాహుబలి బాక్సాఫీస్ ను ముంచెత్తడానికి ఈ శుక్రవారం వస్తోంది’’
‘‘హిందీ ఆడియన్స్ జంతువుల సినిమా బాహుబలి కోసం డబ్బులు వేస్ట్ చేయడం మాని.. బ్లాక్ బస్టర్ భజరంగి భాయిజాన్ కోసం దాచుకోవాలి’’
‘‘బాహుబలి సౌత్ ఇండియా జనాలకు గొప్ప సినిమాలా అనిపించొచ్చు. కానీ హిందీ ఆడియన్స్ కు బాంబే వెల్వెట్ ఎలాగో అలాంటి చెత్త సినిమానే. రేపు అదే రుజువవుతుంది’’