చోటాభీమ్‌ లా ఉండే మోహ‌న్ లాల్ భీముడా?

Update: 2017-04-19 12:29 GMT
భార‌త‌దేశ సినీ రంగ చ‌రిత్ర‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ లేన‌ట్లుగా భారీ మూవీకి ప్లాన్ చేయ‌టం తెలిసిందే. వంద‌.. రెండొంద‌లు.. కాదు ఏకంగా వెయ్యికోట్ల‌తో మ‌హాభార‌త మూవీని తీయ‌టానికి సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ సినిమా మీదా పెట్ట‌ని విధంగా ఈ సినిమాను పెట్టుబ‌డి పెట్టాల‌ని డిసైడ్‌ కావ‌టం తెలిసిందే. మ‌హాభార‌తంలో పాండ‌వుల క‌థ నేప‌థ్యంగా సాగే ఈ క‌థ‌ను.. ప్ర‌ముఖ ర‌చ‌యిత ఎంటీ వాసుదేవ‌న్ నాయ‌ర్ రాసిన రాండామూజ‌మ్ న‌వ‌ల ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ మూవీలో భీముని పాత్ర‌ను ప్ర‌ముఖ మ‌ల‌యాళ న‌టుడు మోహ‌న్ లాల్‌ ను ఎంపిక చేశారు. ఈచిత్రాన్ని బీఆర్ శెట్టి అనే నిర్మాత నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇంత ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంలో భీముని పాత్ర‌కు మోహ‌న్ లాల్‌ ను ఎలా తీసుకుంటార‌ని ప్ర‌శ్నించారు. భీముని పాత్ర‌కు మోహ‌న్ లాల్ అస్స‌లు సూట్ కాడ‌ని.. చోటా బీమ్ లా ఉంటారంటూ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. మోహ‌న్ లాల్‌ ను భీముని క్యారెక్ట‌ర్ చేయించ‌టమంటే.. డ‌బ్బుల్ని వృధా చేయ‌ట‌మేన‌ని విమ‌ర్శ‌కుడు క‌మ‌ల్ ర‌షీద్ ఖాన్ వ్యాఖ్య‌లు చేశారు.

త‌న ఇమేజ్ డ్యామేజ్ చేసేలా వ్యాఖ్య‌లు చేసినా.. మోహ‌న్ లాల్ టీం మాత్రం.. క‌మ‌ల్ ర‌షీద్ వ్యాఖ్య‌ల‌పై అస్స‌లు రియాక్ట్ కాక‌పోవ‌టం గ‌మ‌నార్హం. మోహ‌న్ లాల్ స్థాయికి ఏమాత్రం త‌గ్గ వ్య‌క్తి కాని క‌మ‌ల్ ర‌షీద్ వ్యాఖ్య‌ల్ని లైట్ తీసుకోవాల‌ని భావించిన‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉండే.. ఈ భారీ చిత్రానికి ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న శ్రీకుమార్ మీన‌న్ మాత్రం.. భీముడి పాత్ర‌కు మోహ‌న్ లాల్ త‌ప్పించి మ‌రెవ‌రూ స‌రిపోర‌నటం గ‌మ‌నార్హం. దేశంలోనే అత్యంత పాపుల‌ర్ యాడ్ ఫిలిం మేక‌ర్ అయిన శ్రీకుమార్ మీన‌న్.. త‌న‌కు ల‌భించిన అవ‌కాశంపై ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రాండ‌మాజ‌మ్ న‌వ‌ల అంటే త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని.. అలాంటి న‌వ‌ల‌ను సినిమాగా తీసే అవ‌కాశం రావ‌టం గొప్ప‌గా ఫీల్ కావ‌టం గ‌మ‌నార్హం.

వెయ్యికోట్ల ఖ‌ర్చుతో తీసే ఈ చిత్రంలో న‌టీన‌టుల ఎంపిక కోసం ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇప్ప‌టికే ఒక అంత‌ర్జాతీయ కాస్టింగ్ ఏజెన్సీకి బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లుగా చెబుతున్నారు. మ‌ల‌యాళంలో రాండ‌మాజ‌మ్‌ గా రిలీజ్ కాగా.. ఇత‌ర భాష‌ల్లో మాత్రం మ‌హాభార‌త పేరుతో విడుద‌ల కానుంది. ఈ సినిమాకు వెయ్యి కోట్ల బ‌డ్జెట్ ఎందుక‌న్న‌ది ఒక ప్ర‌శ్న‌గా మారింది.

దీనికి చిత్ర వ‌ర్గాల వారు చెబుతున్న స‌మాచారం ప్ర‌కారం.. ఇంత భారీ సినిమాకు బ‌డ్జెట్ స‌మ‌స్య‌లు ఉండ‌కూడ‌ద‌ని.. అందుకే మొద‌టే భారీ బ‌డ్జెట్‌ ను కేటాయించిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ సినిమాకు స్టంట్ మాస్ట‌ర్ గా పీట‌ర్ హెయిన్స్ ను ఎంపిక చేశారు. ఈ సినిమాలో సాంకేతిక స‌భ్యులుగా అంత‌ర్జాతీయ ప్ర‌ముఖుల్ని రంగంలోకి దించాల‌ని భావిస్తున్నారు. ఈ కార‌ణంగానే బ‌డ్జెట్‌ ను రూ.1000 కోట్లుగా నిర్ణ‌యించిన‌ట్లుగా చెబుతున్నారు. ఆల్ టైం క్లాసిక్ గా సినిమాను రూపొందించాల‌న్న కృత‌నిశ్చ‌యంతో చిత్ర నిర్మాత ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఈ మూవీని మొత్తం రెండు భాగాలుగా తీయాల‌ని.. మొద‌టి భాగానికి సంబంధించి 2018లో సెట్స్ మీద‌కు వెళుతుంద‌ని.. 2020 నాటికి ఫ‌స్ట్ పార్ట్ రిలీజ్ అవుతుంద‌ని చెబుతున్నారు. ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్లిన నాటి నుంచి మ‌రెన్ని సంచ‌ల‌నాలు షురూ అవుతాయో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News