కమాల్ ఆర్.ఖాన్ అని బాలీవుడ్ లో బాలీవుడ్ లో గొప్ప క్రిటిక్ నని తనకు తానే చెప్పుకొంటూ ఉంటాడు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనో.. ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుంటూనే న్యూస్ లో ఉండేలా చూసుకుంటాడు. సౌత్ ఇండియన్ స్టార్స్ నైతే నోటికొచ్చినట్టు కామెంట్ చేస్తుంటాడు. బాహుబలి-2 రిలీజ్ సమయంలో ఈ సినిమా హిందీలో ఎవరూ చూడరంటూ వెక్కిరించి చివరకు సారీ కూడా చెప్పాడు.
ఈ కమాల్ ఆర్.ఖాన్ కో ట్విట్టర్ అకౌంట్ ఉంది. తన ఖాతాలో తరచూ ఏవో ఒక కామెంట్లు పెడుతూ తన ట్విట్టర్ పిట్ట ఏదో ఒకటి కూస్తూ ఉండేలా చూసుకుంటాడు. దాదాపు 6 మిలియన్ల మంది ఇతడిని ఫాలో అవుతూ ఉంటారు. ఈ మధ్య అతడి ట్విట్టర్ అకౌంట్ బందయింది. దానిని తిరిగి యాక్టివేట్ చేయించాలంటూ ట్విట్టర్ వాళ్లను అడుగుతూనే ఉన్నాడు. కానీ అటువైపు నుంచి రెస్పాన్స్ ఉండటం లేదు. దీంతో మనోడు ట్విట్టర్ నే బెదిరించడం మొదలెట్టాడు. పదిహేను రోజుల్లో తన అకౌంట్ ను యాక్టివేట్ చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ అల్టిమేటం ఇచ్చాడు.
ఇంతకూ ఏ ఘనకార్యం చేశావని నీ ట్విట్టర్ అకౌంట్ సస్పెండ్ చేశారని అడిగితే దీనికి బాలీవుడ్ హీరో అమీర్ ఖానే కారణమంటున్నాడు. అతడి లేటెస్ట్ మూవీ సీక్రెట్ సూపర్ స్టార్ గురించి నెగిటివ్ గా రాసినందునే ఇలా చేయించాడంటూ ఆరోపణలు మొదలెట్టాడు. తనేమో నోటికొచ్చింది మాట్లాడతాడు. కానీ అతడిని ఎవరూ ఏమి అనకూడదు.. బావుంది ఈ కమాల్ వరస.. అయినా ట్విట్టర్ ఇతడి బెదిరింపులు లెక్క చేస్తుందా.. చూద్దాం.