యూనివర్శిల్ స్టార్ కమల్ హాసన్ చాలా కాలం తర్వాత థియేటర్ల ద్వారా విక్రమ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నేడు భారీ ఎత్తున దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో విక్రమ్ సినిమా విడుదల అయ్యింది. సినిమా విడుదలకు ముందు కమల్ హాసన్ పెద్ద ఎత్తున ఇంటర్వ్యూ లు ఇచ్చాడు. తెలుగు మీడియా ముందుకు వచ్చి సినిమా యొక్క అనుభవాలను షేర్ చేసుకున్నాడు.
తెలుగు లో మంచి మార్కెట్ ఉన్న కమల్ హాసన్ విక్రమ్ సినిమా ను తెలుగు రాష్ట్రాల్లో భారీగానే ప్రమోట్ చేయడం జరిగింది. వెంకటేష్ ముఖ్య అతిథిగా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన విషయం తెల్సిందే. విక్రమ్ సినిమా విశేషాలను.. తన ఫ్యూచర్ ప్లాన్స్ ను తెలియజేస్తూ వెంకీ కుడుములకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. దర్శకుడు వెంకీ కుడుముల పలు ఆసక్తికర విషయాలను కమల్ హాసన్ నుండి అడిగి అందరు తెలుసుకునేలా చేశాడు.
ఇంటర్వ్యూలో భాగంగా మీరు మీ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కు వెళ్తారా అంటూ వెంకీ అడిగాడు. అందుకు కమల్ స్పందిస్తూ.. నా ప్రతి సినిమా ను కూడా థియేటర్ లో మొదటి రోజు అభిమానులతో కలిసి చూడాలి అనుకుంటాను. కాని వెళ్లలేదు. ఎందుకంటే నేను థియేటర్ లో ఉన్నాను అని తెలిస్తే జనాలు అంతా కూడా స్క్రీన్ పై కంటే ఎక్కువగా నా పై దృష్టి పెడతారు. ముందుకు చూడకుండా నా వైపు చూడాలని భావిస్తారు.
సినిమా చూసే మూడ్ కూడా వారికి ఉండదు. ఎప్పుడెప్పుడు నన్ను చూస్తామా అని ఉంటారు. అందువల్ల సినిమా మొదటి రోజు జనాలను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను థియేటర్ కు వెళ్లడం లేదు. రెండు వారాల తర్వాత థియేటర్ కు వెళ్లి జనాలతో సినిమా చూస్తాను అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. కమల్ హాసన్ తన డ్రీమ్ రోల్స్ గురించి ప్రస్థావించగా ఆసక్తికర సమాధానం చెప్పాడు.
ఇప్పటి వరకు చేసిన సినిమాలు చాలానే ఉన్నాయి. అందులో విభిన్నమైన సినిమాలు.. పాత్రలు 30 నుండి 32 చేసి ఉంటాను. కనుక ఇంకా చాలా విభిన్నమైన పాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక వాటిని చేయడం కోసం వెయిట్ చేస్తున్నాను అన్నట్లుగా కమల్ చెప్పుకొచ్చాడు.
ఇక విక్రమ్ సినిమా విషయానికి వస్తే తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. కమల్ మాత్రమే కాకుండా ఈ సినిమా లో మరో ముగ్గురు స్టార్స్ కూడా ఉన్నారు. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్.. తమిళ స్టార్ విజయ్ సేతుపతితో పాటు కీలకమైన గెస్ట్ రోల్ లో సూర్య నటించాడు.
ఈ నలుగురిని వెండి తెరపై అలా చూస్తుంటే కళ్లు రెండు సరిపోవని అభిమానులు విక్రమ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. నేడు సినిమా విడుదల అవ్వడంతో దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కమల్ అభిమానులు థియేటర్ల ముందు క్యూ కట్టారు.