#క‌రోనా.. ఇంటినే ఆస్ప‌త్రికి.. క‌మ‌ల్ డేరింగ్ డెసిష‌న్

Update: 2020-03-25 19:30 GMT
కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన  అల‌జ‌డిని సృష్టిస్తోంది. ఈ వ్యాధి మన దేశంలో కూడా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో 40 .. ఆంధ్రాలో 8  క‌రోనా పాజిటివ్ కేసులు నిర్ధార‌ణ అవ్వ‌డంతో ఈ భ‌యం అంత‌కంత‌కు పెరుగుతోంది. అటు త‌మిళ‌నాడులో వంద‌లాది మందికి క‌రోనా నిర్ధార‌ణ కావ‌డంతో టెన్ష‌న్ వాతావ‌ర‌ణం అలుముకుంది. దేశ‌వ్యాప్తంగా 500 పాజిటివ్ కేసులు భ‌య‌ పెట్టేస్తున్నాయి.

ఈ విప‌త్తు నేప‌థ్యంలో క్వారెంటైన్ (స్వీయ నిర్భంధ‌నం) ప్రాముఖ్య‌త పెరిగింది. ఇక దీని కోసం ప్ర‌త్యేకించి హాస్ట‌ల్స్ .. మండువా ఇళ్ల‌ను ఖాళీ చేయించి వాటిని అనుమానిత కేసుల కోసం ఉప‌యోగిస్తున్నారు పోలీసులు. అయితే త‌మ ప‌రిస‌రాల్లో ఇలాంటివి ఏర్పాట చేస్తే ప్ర‌జ‌లు మాత్రం క్ష‌మించ‌డం లేదు.

ఇలాంటి స‌న్నివేశంలో నేనున్నాను అంటూ ఆప‌ద్భాంద‌వుడిలా ముందుకొచ్చారు క‌మ‌ల్ హాస‌న్. విశ్వ‌న‌టుడు ఇప్ప‌టికే క‌రోనా బాధితుల ప్ర‌యోజ‌నార్థం 10 లక్షలు విరాళంగా ఇచ్చారు. తాజాగా ఆయ‌న మ‌రో ముంద‌డుగు వేసి తన ఓల్డ్ ఎల్డామ్స్ రోడ్ (చెన్నై) ఇంటిని తాత్కాలిక ఆసుపత్రి గా మార్చడానికి సిద్ధంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. త‌మిళ‌నాడు ప్రభుత్వం సిద్ధంగా ఉంటే కరోనా రోగులకు చికిత్స చేయటానికి వైద్యులు సహాయ పడేందుకు సిద్ధ‌మే. దీంతో ఈ ఇంటికి ప్ర‌భుత్వం అనుమతించే అవ‌కాశం ఉంది.

ఒక ర‌కంగా ఇత‌ర సెల‌బ్రిటీల‌తో పోలిస్తే క‌మల్ హాసన్ నిర్ణ‌యం డేరింగ్ తో కూడుకున్న‌ది. ఎంతో స్వ‌గ‌తించ‌ద‌గిన‌ది. ఆయనలానే ఇంకా ఎంతమంది తారలు దేశం కోసం తమ వంతు సాయం చేయడానికి ముందుకు వస్తారో చూడాలి. క‌రోనా కార‌ణంగా క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న భార‌తీయుడు 2 షూటింగ్ వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే.
Tags:    

Similar News