బాహుబలి.. కచ్చితంగా ఇప్పుడీ సినిమా సెన్సేషన్. దేశవ్యాప్తంగా తిరుగులేని రికార్డులు సృష్టించిన ఈ మూవీ.. తొలిసారిగా 1000 కోట్లు.. 1500 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్లబ్ లను ప్రారంభించింది. భారతీయ సినిమా సత్తా చాటింది. జనాల నుంచి రియాక్షన్ కూడా బాగుండడంతో మేకర్స్ కూడా ఊహించని స్థాయిలో కాసులు కురుస్తున్నాయి.
అలాగని బాహుబలి రెండుభాగాల్లో లోపాలు లేవని అనేందుకు అవకాశం లేదు. చెప్పుకునేందుకు చాలానే ఉంటాయి. అలాగని అందరూ పొగడ్తలు కురిపించడమే తప్ప.. అసలు బాహుబలి గురించి బ్యాడ్ గా ఎవరూ మాట్లాడ్డం లేదు. అందరూ పొగిడే సినిమాపై విమర్శిస్తే.. పని కట్టుకుని మాట్లాడుతున్నారని అనుకునే ప్రమాదం ఉండడమే ఇందుకు కారణం. అయితే.. విశ్వ నటుడు కమల్ హాసన్ మాత్రం ఇందుకు ఏ మాత్రం వెరవ లేదు.. అవసరమైతే బాహుబలిని విమర్శించేందుకు ఏ మాత్రం సంకోచించలేదు.
బాహుబలి లాంటి సినిమా చేస్తారా అంటూ కమల్ హాసన్ కు మీడియా నుంచి ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి 'నేనేమీ గొర్రెను కాదు.. ఎట్ లీస్ట్ గొర్రెల కాపరిని కూడా కాదు. నేను వేరే జాతికి చెందిన జంతువుని. బాహుబలి హిట్ అయింది కాబట్టి.. అలాంటి సినిమా నేను కూడా తీస్తా అనే రకం కాదు నేను' అంటూ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కమల్.
నట విశ్వరూపం చూపించే కమల్ హాసన్.. ఇంత సీరియస్ అయేందుకు కారణాలు లేకపోలేదు. ఇప్పుడు ఇంత టెక్నాలజీ చేతిలో పెట్టుకుని అప్పుడు ఆయా కేరక్టర్లను రకరకాలుగా తీర్చిదిద్దిన సినిమా బాహుబలి. కానీ ఎన్నో పాత్రలను ఏ సాంకేతికత అందుబాటులో లేని రోజుల్లోనే చేసి.. మెప్పించిన మహా నటుడు కమల్ హాసన్. 62 సంవత్సరాల వయసులోనూ ఇంకా కొత్తదనం కోసం.. కొత్తగా నటించేందుకు తపించే గొప్ప యాక్టర్.
విచిత్ర సోదరులు.. భారతీయుడు లాంటి ఎన్నో పాత్రలను అలవోకగా పండించిన కమల్ హాసన్.. దశావతారంలో 10 పాత్రలలో తన నటనా విశ్వరూపాన్ని చూపాడు. ఇప్పుడు బాహుబలి మూవీని చూసి మురిసిపోమంటే.. అందులో గ్రాఫిక్స్ తప్ప కథలో కొత్తదనం ఏముందని నిలదీయడంలో ఆశ్చర్యమేమీ లేదు. సూటిగా మాట్లాడుకుంటే.. బోలెడంత కథ ఉండే పాత చిత్రాలలో ఉండే సబ్ ప్లాట్ అంత కూడా.. మొత్తం బాహుబలి రెండు భాగాల కథ ఉండదు.
ఇక అన్ని విషయాలకు గ్రాఫిక్స్ పై బాహుబలి ఆధారపడితే.. కేవలం తన నటనతోనే ఎలాంటి పాత్రనైనా మెప్పించే సత్తా కమల్ ది. అందుకే ఇప్పుడు బాహుబలి లాంటి సినిమా తీస్తానని అనేందుకు తాను గొర్రెను కాను అంటూ కటువుగా సమాధానం ఇచ్చాడు లోకనాయకుడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/