విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ''విక్రమ్''. ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి - మలయాళ నేచురల్ స్టార్ ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలెంటెడ్, యంగ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఇప్పటికే విడుదలైన 'విక్రమ్' ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుని.. సినిమాపై అంచనాలు పెంచేసింది. ఈ చిత్రాన్ని 2022 జూన్ 3న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. 'విక్రమ్' రాకకు కౌంట్ డౌన్ బిగిన్ చేస్తూ ఓ స్పెషల్ వీడియోని వదిలారు. గన్ ఫైరింగ్ నుంచి వచ్చిన బుల్లెట్స్ తో 25 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రాబోతున్నట్లు పేర్కొన్నారు.
'విక్రమ్' సినిమాతో కమల్ హాసన్ పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతారని అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల కాలంలో పలు సౌత్ సినిమాలు నార్త్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మన చిత్రాల ధాటికి బాలీవుడ్ బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది.
'పుష్ప: ది రైజ్' సినిమా హిందీ వర్షన్ 100 కోట్లకు పైగా వసూళ్ళు రాబడితే.. RRR చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుంది. ఇదే క్రమంలో వచ్చిన 'కేజీఎఫ్ 2' సినిమా బాలీవుడ్ లో 400 కోట్లకు పైగా వసూళ్లతో 1100 కోట్ల వరల్డ్ వైడ్ వసూళ్ల దిశగా దూసుకుపోతోంది.
అయితే ఈ మూడు సినిమాల తర్వాత నేషనల్ వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసే స్టామినా ఉన్న దక్షిణాది చిత్రం 'విక్రమ్' అని అంచనా వేస్తున్నారు. గతంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన ఎన్నో సినిమాలు బాలీవుడ్ లోనూ మంచి సక్సెస్ అయ్యాయి.
అయితే ఇప్పుడు కమల్ తో పాటుగా విజయ్ సేతుపతి - ఫాహాద్ ఫాజిల్ వంటి మరో ఇద్దరు విలక్షణ నటులు కలిసి చేసిన సినిమా కావడంతో అందరిలో 'విక్రమ్' పై అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ వీరికి 'ఖైదీ' 'మాస్టర్' వంటి సినిమాలతో ఆకట్టుకున్న లోకేష్ కనకరాజ్ జత చేరాడు.
ఈ నేపథ్యంలో 'విక్రమ్' సినిమాపై మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉండటంతో నార్త్ మాస్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తుందని భావించవచ్చు. ఇప్పటి వరకు బాలీవుడ్ లో సత్తా చాటిన మూడు సౌత్ సినిమాలు ఇదే కోవలో వచ్చినవనే సంగతి తెలిసిందే.
అందుకే ఉత్తరాది జనాలోకి 'విక్రమ్' చిత్రాన్ని తీసుకెళ్లడానికి కమల్ హసన్ అండ్ టీమ్ ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగా పాపులర్ కపిల్ శర్మ షోకు కమల్ గెస్టుగా హాజరవడంతో బాలీవుడ్ లో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.
ఇదే క్రమంలో ఈ నెల 15న అన్ని భాషల్లో 'విక్రమ్' ట్రైలర్ రిలీజ్ కాబోతోంది. ఇది అంచనాలకు తగ్గట్లు ఉండి రాబోయే రోజుల్లో అగ్రిసివ్ గా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తే.. కమల్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
'విక్రమ్' చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హసన్ - ఆర్ మహేంద్రన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ క్లోజ్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది కమల్ కెరీర్ లోనే అత్యధికమని అంటున్నారు.
అనిరుధ్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సతీష్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఫైట్ మాస్టర్స్ ద్వయం అన్బు - అరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేయగా.. ఫీలోమీన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.