ఇండస్ట్రీలో లైంగిక వేదింపులు అనేవి చాలా కామన్ అయ్యాయి. ఒక వైపు నుండి మీటూ ఉద్యమం, మరో వైపు కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేక పోరాటం ఇలా రకరకాలుగా జరుగుతున్నా కూడా లైంగిక వేదింపులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. నటిపై లైంగిక వేదింపులు తరచు మీడియాలో వస్తూనే ఉన్నాయి. తాజాగా తమిళనాట మరో లైంగిక వేదింపుల కేసు నమోదు అయ్యింది. రష్యన్ బ్యూటీ రి డ్జావి అలెగ్జాండ్రా గత పదేళ్లుగా చెన్నైలో కుటుంబంతో పాటు ఉంటూ యాడ్స్ లో నటించడంతో పాటు, అప్పుడప్పుడు సినిమాల్లో కూడా నటిస్తోంది.
ఇటీవల ఈమె లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన 'కాంచన 3' అనే చిత్రంలో కూడా నటించింది. తాజాగా ఈమె చెన్నై పోలీసులకు లైంగిక వేదింపుల ఫిర్యాదు ఇచ్చింది. తనతో పలు యాడ్స్ లో నటించిన రుబేష్ కుమార్ తనను లైంగికంగా వేదిస్తున్నాడని, తన ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ ఫిర్యాదులో పేర్కొంది. యాడ్ షూట్ పేరుతో కొన్ని రోజుల క్రితం నా ఫొటోలను పలు యాంగిల్స్ లో తీసిన అతడు ఇప్పుడు వాటిని కోరిక తీర్చకుంటే బయటకు వదులుతాను అంటూ బెదిరిస్తున్నాడు అంటూ ఫిర్యాదులో పేర్కొంది.
రి డ్జావి అలెగ్జాండ్రా ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఈ కేసు విషయమై విచారణ చేపట్టారు. అతడి వద్ద ఉన్న ఫొటోలను డిలీట్ చేయించడంతో పాటు, బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డందుకు అతడిని అరెస్ట్ చేయడం జరిగింది. కోర్టు ముందు ప్రవేశ పెట్టిన అతడిని, జైలుకు తరలించారు. అవకాశాల పేరుతో మోసం చేసే ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని మహిళలకు పోలీసులు ఎంతగా చెబుతున్నా కూడా వారు నమ్ముతూనే మోసపోతున్నారు.