అన్నీ రాళ్ళ వెనకాలే చేసిన క్వీన్

Update: 2016-10-25 07:30 GMT
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ హైలీ ట్యాలెంటెడ్ అనే విషయంలో ఎలాంటి డౌట్స్ ఎవరికీ ఉండవు. సినిమా కోసం ఏది ఎంత చేయాలో.. అంతా చేసేయడం ఈమె కమిట్మెంట్ ను చాటుతుంది. ప్రస్తుతం రంగూన్ మూవీలో నటిస్తోంది. విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో.. మెజారిటీ పోర్షన్ ను ఈశాన్య రాష్ట్రాల్లోనే షూట్ చేశారు. అప్పుడు పడ్డ కష్టాలను.. ఎదురైన పరిస్థితులను కంగనా రనౌత్ చెబుతుంటే.. వినడానికి కూడా భయమేసేస్తుంది.

హీరోయిన్ నేహ ధూపియా నిర్వహిస్తున్న నో ఫిల్టర్ నేహ కార్యక్రమానికి వచ్చిన కంగనా.. తన కెరీర్ కి సంబంధించి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పింది. క్వీన్ మూవీ కోసం యూరోప్ లో ఉన్నపుడు కేఫ్‌ లలో డ్రస్ ఛేంజ్ చేసుకుని సినిమా షూటింగ్ చేసిందట. ఇప్పుడు రంగూన్ కోసం అయితే.. ఇంకా కష్టపడాల్సి వచ్చిందని అంటోందీ ట్యాలెంటెడ్ బ్యూటీ. 'మనకు అలవాటైన సౌకర్యాల నుంచి పక్కకు జరిగితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు స్టార్ అయినా.. కాకపోయినా ఒకటే' అంటూ మొదలుపెట్టింది కంగనా.

'ఎంచుకునే సినిమాలే పరిస్థితులకు కారణం అవుతాయి. రంగూన్ కోసం అరుణాచల్ ప్రదేశ్ లో మారుమూల లోయల వరకూ వెళ్లాం. అక్కడ కనీసం పల్లెటూళ్లు కూడా లేవు. ఎట్ లీస్ట్ వాష్ రూమ్ ఫెసిలిటీ కూడా లేదు. దానితో సహా.. డ్రస్ ఛేంజ్ వరకూ అన్నీ రాళ్ల వెనకాలే చేయాల్సి వచ్చింది. నేనొక్కదాన్నే కాదు షాహిద్ కి కూడా అదే చేయక తప్పలేదు. అప్పటి పరిస్థితి అది. అంతకంటే ఏం చేయగలం' అంటూ ఓపెన్ గా చెప్పేసింది కంగనా రనౌత్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News