బాలీవుడ్ డ్రగ్స్ కేసులో పలువురు అగ్ర కథానాయికల పేర్లు జాతీయ మీడియాల్లో హైలైట్ అయిన సంగతి విధితమే. ఇందులో దీపికా పదుకొనే పేరు ప్రముఖంగా వినిపిస్తుండడంతో ఇదే అదనుగా కంగన ట్వీట్ హీట్ పెంచింది. దీపిక పదుకొనే అన్న పేరు ఉపయోగించుకుండా రిచ్ స్టార్ చిల్ట్రన్ అంటూ వ్యంగ్యంగా అంటూ ... ``మాదకద్రవ్యాల దుర్వినియోగం దాని పరిణామం`` అని ట్వీట్ చేసింది.
దీపికా పదుకొనేను మరింతగా కంగారు పెట్టే ప్రయత్నమే చేసింది కంగన. ``రిపీట్ ఆఫర్ట్ మి.. నా తర్వాత మాదకద్రవ్యాల దుర్వినియోగం పరిణామమిది. క్లాస్సీ అని చెప్పుకునే .. మంచి పెంపకం ఉన్న హై సొసైటీ రిచ్ స్టార్ పిల్లలు అని పిలవబడే వారి మేనేజర్ MAAL HAI KYA ను అడగండి? బాయ్ కాట్ బాలీవుడ్ డ్రగ్గీస్ # దీపిక పదుకొనే`` అంటూ సెటైర్ వేసింది దీపికపై. మరో ట్వీట్ లో ``రిపీట్ ఆఫర్ట్ మీ: డిప్రెషన్ అనేది మానసిక రుగ్మతకు కారకం!`` అంటూ రాయడం ఆసక్తికర చర్చకు తావిచ్చింది.
ఓవైపు కంగన వర్సెస్ దీపిక వ్యవహారంపై కథనాలు వస్తుండగానే మరోవైపు సుశాంత్ కేసులో దర్యాప్తు విషయంపైనా అప్ డేట్స్ వేడెక్కిస్తున్నాయి. ఎన్.సి.బి వర్గాల సమాచారం ప్రకారం.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు దర్యాప్తునకు సంబంధించి నమోదైన డ్రగ్స్ కేసులో అరెస్టయిన కథానాయిక రియా చక్రవర్తి.. సెప్టెంబర్ 6 నుంచి సెప్టెంబర్ 9 మధ్య ఏజెన్సీ ఆమెను ప్రశ్నించినప్పుడు రకరకాల పేర్లు తెరపైకొచ్చాయని జాతీయ మీడియా కథనాలు వెలువరించింది. ఇందులోనే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) ఈ వారంలో నటి సారా అలీ ఖాన్ కు సమన్లు జారీ చేయనుందన్న కథనాలు వేడెక్కిస్తున్నాయి.
డ్రగ్స్ కు సంబంధించిన కేసులో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ టాలెంట్ మేనేజర్ జయ సాహా.. సెలబ్రిటీ మేనేజర్ శ్రుతి మోదీలను ఐదు గంటలకు పైగా ఎన్‌సిబి సోమవారం ప్రశ్నించింది. మాదకద్రవ్యాలకు సంబంధించిన చాట్లపై సాహాను ఐదు గంటలకు పైగా ఎన్.సిబి అధికారులు ప్రశ్నించారు. అనేక ఇతర ప్రముఖులతో మాదకద్రవ్యాల చాట్ల గురించి సాహాను కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మాదకద్రవ్యాల వాడకం గురించి శ్రుతి మోడిని ప్రశ్నించారు.