బాలీవుడ్ లో నటీమణులు చాలామందే ఉండొచ్చు. కానీ.. రీల్ క్వీన్ కంగనా రౌనత్ తీరు కాస్త భిన్నం. తనకు తానుగా కెలికి మరీ తిట్టిపోసే కంగనాకు.. తనను టార్గెట్ చేసే వారి విషయంలో మరింత కరకుగా ఉండటమే కాదు.. ముఖం పగిలేలా ఆమె సమాధానం ఉంటుంది. అందుకే.. ఆమె మాటలు తరచూ హాట్ టాపిక్ గా మారుతుంటాయి. తాజాగా తనను ఉద్దేశించి మధ్యప్రదేశ్ మాజీ మంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందించారు.
కంగనాను ఉద్దేశించి మాజీ మంత్రి సుఖ్ దేవ్ పన్సే మాట్లాడుతూ.. రికార్డింగ్ డ్యాన్సర్ అన్న అర్థం వచ్చేలా ఆమెపై ఫైర్ అయ్యారు. అంతే.. ఆయన మాటలకు తీవ్రంగా స్పందించింది కంగనా. తనపై వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఎవరు? కత్రినా.. దీపికా పదుకొణె.. ఆలియాభట్ లాంటి వ్యక్తిని కాదని ఇతనికి తెలుసా? ఐటమ్ సాంగ్స్ చేయని ఒకే ఒక్క హీరోయిన్ తాను ఒక్కదానని.. బడా హీరోల మూవీ ప్రాజెక్టుల్ని సైతం రిజెక్టు చేసిన వ్యక్తినన్న విషయాన్ని గుర్తు చేశారు.
తాను ఒక రాజ్ పుత్ మహిళనని.. వయ్యారాలు ఒలికించను.. కేవలం ఎముకలు విరగ్గొడతా అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అంతా బాగానే ఉంది కానీ మాజీ మంత్రికి మంట పుట్టేలా మాటలు అనాలంటే.. మధ్యలో కత్రినా.. దీపికా.. అలియాభట్ ప్రస్తావన తీసుకురావాల్సిందేనా కంగనా?