బాలీవుడ్ లో ఫేజ్ 3 కల్చర్ పై మధుర్ భండార్కర్ తీసిన సినిమాలు ఎన్నో విషయాల్ని బయటి ప్రపంచానికి ఆవిష్కరించాయి. కానీ వాటన్నిటినీ మించిన బోలెడన్ని విషయాలు తెరల మాటున చీకట్లో ఇంకా దాగి ఉన్నాయని ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ వెనక నిజాలు ఒక్కొక్క వ్యవహారం గుట్టును విప్పుతున్నాయి. బాలీవుడ్ లో ఉండే అనధికారిక మాఫియాలు ఎలాంటి కుట్రలకు పాల్పడతాయో ఆవిష్కరిస్తున్నాయి.
అయితే ఈ ఘటనకు ముందే.. చాలా మంది చేయలేనిది రెబల్ క్వీన్ కంగన చేసి చూపించింది. బాలీవుడ్ మాఫియాల్ని కంగన ప్రతిసారీ కెలుకుతూనే ఉంది. అటువైపు ఎంత పెద్ద హెడ్ ఉన్నా అనైతిక అరాచకులపైనా వికృత విషయాలపైనా కంగన ఏమాత్రం భయపడకుండా విమర్శలు గుప్పిస్తూనే ఉంది. ప్రఖ్యాత మ్యాగజైన్ వోగ్ హెడ్స్ తనని ఒక విరోధిగా చూడడం.. అందులో పని చేసే ఫ్యాషన్ హెడ్ తనని దూరం పెట్టడం వంటి ఎన్నో విషయాల్ని తాజా ఇంటర్వ్యూలో బహిర్గతం చేసిన కంగన మరోసారి హీట్ పెంచింది.
తాను ఏలిస్టర్ కాకపోవడం వల్ల తనకు స్టైలింగ్ చేసేందుకు `వోగ్` ఫ్యాషన్ డిజైనర్ అనితా అదజానియా ఇష్టపడలేదని కంగన షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. వోగ్ కవర్ పేజీ కోసం రెండు సార్లు తాను ఫోటోషూట్లు చేశానని వెల్లడించిన కంగన .. తనకు స్టైలింగ్ చేసేందుకు తనని అందంగా డిజైన్ చేసేందుకు అనిత ష్రాఫ్ అదజానియా రాలేదని వెల్లడించింది.
తన ఫోటోల్ని వీడియోల్ని తమ అవసరానికి పదే పదే వాడుకున్నారు తప్ప వోగ్ తనకు ఎంతమాత్రం ఉపయోగపడలేదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఫ్యాషన్ సినిమా సమయంలో వోగ్ కవర్ పేజీపై ప్రియాంక చోప్రా ముఖ చిత్రాన్ని ముద్రించిన సదరు మ్యాగజైన్ వాళ్లు తనని విస్మరించారని విమర్శించింది. తాను బయటి వ్యక్తిని కాబట్టే బాలీవుడ్ తనని అలా ట్రీట్ చేసిందన్న తీవ్ర ఆరోపణలు చేసింది కంగన. తన సినిమా మణికర్ణికకు ప్రచారం కావాలని వోగ్ ని సంప్రదించినా స్పందించలేదని .. తనను ఐదేళ్లుగా ఆ మ్యాగజైన్ హెడ్స్ దూరం పెట్టారని కూడా సంచలన ఆరోపణలు చేసింది రెబల్ క్వీన్.