ఐటీ రెయిడ్స్ భయం లేదా!?

Update: 2017-05-02 06:40 GMT
భారతీయ సినిమా చరిత్రలో బాహుబలి2 అతి పెద్ద హిట్. ఈ విషయంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. తొలి వీకెండ్ ముగిసేనాటికే..  కేవలం మూడే రోజుల్లో ఈ సినిమా సాధించిన 271+ కోట్లు షేర్ వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే కేవలం భారతదేశం నుంచే ఈ సినిమా కలెక్షన్స్ మూడు రోజులకు రూ. 303 కోట్లు 'నెట్' వచ్చిందని అంటున్నాడు కరణ్‌ జోహార్.

'చరిత్రలో అతి పెద్ద బ్లాక్ బస్టర్. హిందీ వెర్షన్ కు 128 కోట్లు.. తెలుగు-తమిళ్-మలయాళ వెర్షన్లకు 175 కోట్లు.. మొత్తం మూడు రోజుల్లో 303 కోట్లు' అంటూ హిందీ వెర్షన్ నిర్మాత కరణ్ జోహార్ అధికారికంగా ట్వీట్ చేశాడు. అంతే కాదు.. ఇదే విషయాన్ని పోస్టర్ ద్వారా కూడా వెల్లడించాడు. కలెక్షన్స్ లెక్కలను ట్రేడ్ జనాలు చెప్పడం వేరు.. నిర్మాతలు స్వయంగా అనౌన్స్ చేయడం వేరు. ప్రొడ్యూసర్స్ ఇలా కలెక్షన్స్ ను ప్రకటించడం అంటే.. అన్నిటికీ సిద్ధంగా ఉన్నారనే చెప్పాలి. మంచి హిట్స్ సాధించిన మూవీ మేకర్స్ పై ఈ మధ్య ఇన్ కం ట్యాక్స్ దాడులు ఎక్కువయ్యాయి.

అందుకే చాలామంది వసూళ్ల లెక్కల విషయంలో సైలెంట్ గానే ఉంటున్నారు. కానీ బాహుబలి నిర్మాతలు మాత్రం కలెక్షన్స్ ను ఓపెన్ గానే చెబుతున్నారు. ఐటీ రెయిడ్స్ భయం కంటే.. దేశంలోనే బిగ్గెస్ట్ హిట్ అనే క్రెడిట్ ను ప్రచారం చేసుకునేందుకే ఎక్కువ ఉత్సాహం చూపిస్తుండడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News