ఏమాటకామాట చెప్పుకోవాలంటే కరణ్ జోహార్ నిజం ఒప్పుకున్నాడు. గతంలో ఒక హీరోయిన్ విషయంలో తాను ఏర్పరచుకున్న అభిప్రాయం తప్పని తేలిందని చెబుతూ... ఆమెపై తనకు ముందున్న అభిప్రాయం ఇప్పుడు పూర్తిగా మారిందని ప్రకటించాడు. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరనేగా... ఆమే అనుష్క శర్మ. అవును... "రబ్ నే బనాదె జోడి" సమయంలో అనుష్క శర్మ అంటే కరణ్ జోహార్ కి అస్సలు సరైన అభిప్రాయం లేదంట!
వివరాల్లోకి వెళ్తే... బాలీవుడ్లో యశ్ రాజ్ ఫిలిమ్స్ వాళ్లు ఒక నటుడిలో లేదా ఒక నటిలో టాలెంట్ చూశారంటే, వారి నటనపై వారికి సరైన అభిప్రాయం ఏర్పడిందంటే... వెంటనే కనీసం మూడు సినిమాలు తమ సంస్థలోనే చేసేలా ఒప్పందాలు చేసేసుకుంటారు. ఋఅన్ వీ సింగ్ - అనుష్క శర్మ - వాణీ కపూర్ ఇలా ఆ సంస్థ లో ఒప్పందాలు చేసుకుని ఆ తర్వాత ఒక రేంజ్ కి వెళ్లిన వారిలో ఉన్నారు!! అయితే వీళ్లలో అనుష్క శర్మ మీద తనకు మాత్రం సరైన అభిప్రాయం లేదని.. ఆ అమ్మాయికి అంత పెద్ద సంస్థలో అవకాశం దక్కడం తనకేమాత్రం నచ్చలేదని అంటున్నాడు ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్.
అనుష్క శర్మకు ఆదిత్య చోప్రా "రబ్ నె బనాదె జోడీ" లాంటి పెద్ద సినిమాలో ఛాన్సివ్వడం తనకు నచ్చలేదని, ఆ టైంలో ఆమె వద్దని గట్టిగా చెప్పానని.. ఇంకెవరైనా ప్రముఖ హీరోయిన్ని తీసుకోమని సలహా కూడా ఇచ్చానని, కానీ ఆదిత్య తన మాట వినకుండా ఆమెతోనే సినిమా చేశాడని చెబుతున్నాడు కరణ్ జోహార్. అయితే ఆ సినిమాలో అనుష్క శర్మ నటన చూసిన తర్వాత తన అభిప్రాయం మారిందట. అర్రె... ఇలాంటి నటీ కెరీర్ నా నేను నాశనం చేయాలనుకున్నది అని తెగ బాధపడ్డాడట. ఈ విషయాలని "యే దిల్ హై ముష్కిల్" సినిమా ప్రమోషన్లలో భాగంగా కరణ్ వెల్లడించాడు.