'కాఫీవిత్ కరణ్' టాక్ షో దేశ వ్యాప్తంగా ఎంతో ఫేమస్ టాక్ షో అన్నది తెలిసిందే. అన్ని భాషల ప్రేక్షకుల్ని అలరించిన ఏకైక బాలీవుడ్ టాక్ షో ఇది. బాలీవుడ్ టాక్ షోల గురించి మాట్లాడాల్సి వస్తే కరణ్ టాక్ షోకి ముందు..తర్వాత అని కచ్చితంగా చెప్పాల్సిన విషయం. కరణ్ టాక్ షోకి పూర్తి ఓపెన్ మైండ్ తోనే హాజరవ్వాలి.
ఎలాంటి ప్రశ్నలనైనా ఎదుర్కునే దమ్ముండాలి. సినిమాలతో పాటు..వ్యక్తిగత విషయాల్ని టాక్ షోలో చర్చించడం కరణ్ ప్రత్యేకత. టాక్ షో అంత పెద్ద హిట్ అవ్వడానికి ప్రధాన కారణం వ్యక్తిగత ప్రశ్నలే. ఈ కారణంగా ఎన్నోసార్లు టాక్ షో వివాదాస్పందంగా మారిన సందర్భాలున్నాయి. సెలబ్రిటీలు..క్రికెటర్లని టాక్ షోకి ఆహ్వానించి వారి ప్రయాణల గురించి ప్రస్తావించడం..ఎఫైర్ల సంగతి తేల్చడం వంటివి టాక్ షోలో మెయిన్ హైలైట్ గా చెప్పొచ్చు.
ఆ కారణంగా క్రికెటర్లు హార్ది పాండ్య..కె. ఎల్ రాహుల్ బిసీసీఐ నిషేధానికి సైతం గురయ్యారు. దర్శక..నిర్మాత కరణ్ జోహార్ ఇప్పటివకూ ఆరు సీజన్లకు హోస్ట్ గా చేసారు. చివరి సీజన్ 2018 లోస్టార్ వరల్డ్ లో ప్రీమియర్ అయింది. అయితే టాక్ షో విషయంలో కరణ్ జోహార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హోస్ట్ బాధ్యతల నుంచి కరణ్ జోహార్ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా కరణ్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసారు. ''కాఫీ విత్ కరణ్ ఆరు సీజన్లుగా నాజీవితంలో- మీ జీవితాలల్ఓ భాగమైంది. పాప్ కల్చర్ చరిత్రలో మా ప్రభావం ఉందని చెప్పగలను. మా స్థానం కూడా ఉందని కనుగున్నాను. కాబట్టి మళ్లీ కాఫీ విత్ కరణ్ తిరిగి రాదని బురువెక్కిన హృదయంతో ప్రకటిస్తున్నాను' అని ఓ లేఖ పోస్ట్ చేసారు.
మరి ఈ సంచలన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ? అన్న వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. మరి ఇప్పుడా బాధ్యతలు కొత్త వారు ఎవరైనా తీసుకుంటారా? మొత్తంగా టాక్ షోనే నిలిపివేస్తున్నారా? అన్నది ఇంకా తెలియదు. కరణ్ హోస్ట్ గా ఉన్నంత కాలం టాక్ షో ఓ రేంజ్ లో ఫేమస్ అయింది.
కరణ్ టాక్ షో తర్వాత బాలీవుడ్ లో చాలా టాక్ షోలు ప్రారంభం అయ్యాయి. కానీ కరణ్ షోని కొట్టే షో మాత్రం మరొకటి రాలేదనే చెప్పాలి. టాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు ఈ టాక్ షోకి హాజరయ్యారు. ప్రభాస్..రాజమౌళి...ఎన్టీఆర్..రామ్ చరణ్ తదితరులు కరణ్ తో కాపీ షేర్ చేసుకున్నారు.