ఇప్పుడంటే భర్త సైఫ్ అలీ ఖాన్, కొడుకు తైమూర్ తో హ్యాపీ గా ఉంది కాని అంతకు ముందు హీరో షాహిద్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలిందని బెబో బ్యూటీ కరీనా కపూర్ మీద చాలా కథనాలే వచ్చాయి. వాటిని నిజం చేసేలా ఇద్దరు కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం, అవసరానికి మించి పబ్లిక్ లైఫ్ లో కలిసిపోవడం సుమారు ఓ ఐదేళ్ళ పాటు మామూలు రచ్చ జరగలేదు. అప్పటికి షాహిద్ కపూర్ అప్ కమింగ్ హీరో. కరీనా చూస్తే టాప్ లీగ్ లో ఊపిరి సలపనంత బిజీగా సినిమాలు చేస్తోంది. ఈ ఇద్దరికీ అసలు జోడి ఎలా కుదిరిందా అని ఫాన్స్ కూడా తెగ ఆలోచించారు. ఇద్దరు కలిసి మొదటిసారి ఫిదా అనే హింది సినిమాలో కలిసి నటించారు. అక్కడే ప్రేమ మొదలైందని గుసగుసలు విన్పించేవి. ఆ తర్వాత 36 చైనా టౌన్ - చుప్ చుప్ కే - క్యా లవ్ స్టొరీ హై - జబ్ వీ మెట్ - మిలేంగే మిలేంగే - బోంబే టాకీస్ అని వరసగా ఆరు సినిమాలు చేసారు.
వీటిలో జబ్ వీ మెట్ ఒక్కటే ఘన విజయం సాధించింది. మిగిలినవన్నీ అంతంత మాత్రంగా ఆడినవే. కాని వీళ్ళ ప్రేమ మాత్రం సూపర్ హిట్ అని బాలీవుడ్ మీడియా కాస్త గట్టిగానే ప్రచారం చేసింది. కట్ చేస్తే ఇద్దరికీ బ్రేక్ అప్ కావడం, కరీనా సైఫ్ వైపు యు టర్న్ తీసుకోవడం, ఎక్కువ టైం తీసుకోకుండా పెళ్లి చేసుకోవడం చకచక జరిగిపోయారు. ఈ నేపదంలో కరీనా - షాహిద్ ఇక ఎప్పటికి కలుసుకోరేమో అనే టాక్ కూడా వచ్చింది. కాని కరీనా వాటికి పూర్తిగా చెక్ పెట్టేసింది. తనకు షాహిద్ కు ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేసింది.
షాహిద్ కు 2015లో మీరా రాజ్ పుత్ తో పెళ్లి ఫిక్స్ అయినప్పుడు మొదట తనకే చెప్పి ఫస్ట్ వెడ్డింగ్ కార్డు ఇచ్చాడన్న కరీనా ఇప్పటికీ తాము ఎక్కడ కలుసుకున్నా ఎటువంటి అరమరికలు లేకుండా మాట్లాడుకుంటామని సెలవిచ్చింది. ఫెమినా ఈవెంట్ టైంలో షాహిద్ తనను కలిసినప్పుడు గుక్క తిప్పుకోకుండా తన కుటుంబ విశేషాలు పంచుకున్నాడని చెప్పిన కరీనా మొత్తానికి ఒక పెద్ద స్టొరీకి ముగింపు శుభం అంటూ పలికేసింది.