తమిళనటుడు కార్తీ మొదట్నుంచీ ఫార్ములా సినిమాలకు వ్యతిరేకమే. అతడు సినిమా చేస్తున్నాడంటే.. సమ్ థింగ్ డిఫరెంట్ ఉండాలి. కార్తీ కెరీర్ ను పరిశీలిస్తే ఈ విషయం ఈజీగా అర్థమైపోతుంది. ఈ హీరో మొదటి సినిమా ‘పరుత్తి వీరన్’. తెలుగులో ‘మల్లిగాడు’ పేరుతో వచ్చింది. హీరో సూర్య తమ్ముడిగా బంబాట్ గా లాంఛ్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ.. ఓ మొరటు వ్యక్తిపాత్రతో ఇంట్రుడ్యూస్ అయ్యాడు.
ఆ విధంగా.. తాను రెగ్యులర్ హీరో కాదని చాటుకున్న కార్తీ.. తన విలక్షణతను విస్తరించుకుంటూ వెళ్లాడు. యుగానికి ఒక్కడు, నాపేరు శివ, ఖైదీ వంటి విభిన్నమైన చిత్రాలను ఎంపిక చేసుకొని బాక్సాఫీస్ వద్ద కూడా మోత మోగించాడు. ఇప్పడు ‘సర్దార్’గా రాబోతున్నాడు.
ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ వీడియోను.. లేటెస్ట్ గా రిలీజ్ చేసింది యూనిట్. పీఎస్ మిత్రన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. మధ్య వయసు వ్యక్తిగా కనిపిస్తున్నాడు కార్తీ.
నెరిసిన జుట్టు, గడ్డంతో ఉన్న కార్తీ లుక్.. మరోసారి సమ్ థింగ్ డిఫరెంట్ అనే విషయాన్ని క్లియర్ కట్ గా రివీల్ చేస్తోంది. కార్తీ సాల్ట్ పెప్పర్ లుక్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో పాకిస్తాన్, చైనా అంటూ చూపించడంతో.. సరిహద్దు సమస్యలు ఇతివృత్తంగా సినిమా తెరకెక్కుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ చిత్రంలో రాశీఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం సమకూరుస్తున్నారు.
Full View