యూఎస్ బాక్సాఫీస్.. ఆ రికార్డులో కార్తికేయ 2

Update: 2022-08-30 08:53 GMT
విడుదలకు ముందు పెద్దగా అంచనాలు క్రియేట్ చేయలకపోయినప్పటికి కార్తికేయ 2 రిలీజ్ తరువాత బాక్సాఫీస్ వద్ద అసలైన పాన్ ఇండియా రుచిని చూపిస్తోంది. బారి బడ్జెట్ స్టార్ క్యాస్ట్ కంటే కూడా జనాలకు కనెక్ట్ అయ్యే కంటెంట్ ముఖ్యమైని ఒక బలమైన ఉదాహరణతో వచ్చిన ఈ సినిమా పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు అందిస్తోంది.

ఆగష్టు 13 న లిమిటెడ్ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రెండవ రోజు నుంచి ఊహించని విధంగా వేలాది థియేటర్లను అక్రమించుకుంది. పాజిటివ్ మౌత్ టాక్ కారణంగా మొదటి రోజు నుండి ఊపందుకుంది. మూడవ వారంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో మరియు హిందీ బెల్ట్‌లోనే కాకుండా US బాక్సాఫీస్ వద్ద కూడా మంచి రన్‌ను కొనసాగించింది. ఇక మూడవ ఆదివారం ముగిసే సమయానికి, కార్తికేయ 2 US బాక్సాఫీస్ వద్ద 1.35 మిలియన్ల డాలర్స్ ను వసూలు చేసింది. ఒక విధంగా మిడియం రేంజ్ సినిమాలలో ఇది బెస్ట్ రికార్డ్ అని చెప్పవచ్చు.

ఆశ్చర్యకరంగా కార్తికేయ 2.. RRR, రాధే శ్యామ్, సర్కారు వారి పాట అలాగే భీమ్లా నాయక్ వంటి బిగ్ స్టార్స్ సినిమాల రేంజ్ లో కలెక్షన్స్ అందుకొని 2022లో USAలో అత్యధిక వసూళ్లు సాధించిన ఐదవ చిత్రంగా నిలిచింది.

ఇక కార్తికేయ2 యుఎస్ బాక్సాఫీస్ వద్ద 1.5 మిలియన్ల డాలర్స్ అందుకోవడానికి చాలా దగ్గరలో ఉంది. త్వరలోనే ఆ మార్కును దాటే  అవకాశాలు ఉన్నాయి. పోటీగా నిలుస్తుంది అనుకున్న లైగర్ అక్కడ కేవలం 800k డాలర్స్ మార్కును దాటడానికి కష్టపడుతొంది.  లైగర్ యొక్క యుఎస్ డిస్ట్రిబ్యూటర్లు భారీ నష్టాలను చూసే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

ఇక మరో బాక్సాఫీస్ మొవీగా సీతారామం ఇప్పుడు యుఎస్‌లో ముగింపు దశకు వస్తోంది. ఆ సినిమా అక్కడ మొత్తం ఇప్పటి వరకు 1.33 మిలియన్ల డాలర్స్ అందుకుంది. మరోవైపు బాంబిసార కూడా అదే రేంజ్ లో కలెక్షన్స్ అందుకొని యూఎస్ బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ మార్కెట్ వాల్యుని పెంచింది. ఏదేమైనా కూడా టాలీవుడ్ సినిమాల రేంజ్ యూఎస్ లో అంతకంతకూ పెరుగుతూనే ఉండడం గుడ్ న్యూస్. మరి రాబోయే సినిమాలు ఎలాంటి కలెక్షన్లను అందుకుంటాయో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News