టాలీవుడ్ లో కొత్త హీరోలు వస్తున్న సంగతి తెలిసిందే. రోటీన్ కు భిన్నంగా ఉండే సినిమాల్ని చేసేందుకు ఆసక్తిని చేూపించటమే కాదు.. అవసరమైతే విలన్ పాత్రలు వేసేందుకు సైతం వెనుకాడని కొత్త తరం ఇప్పుడు టాలీవుడ్ కు వచ్చేసింది. అలాంటి కోవలోకే వస్తారు ఆర్ఎక్స్ 100 హీరోగా సుపరిచితుడు కార్తికేయ.
తాజాగా నాలుగైదు సినిమాలు చేతిలో ఉన్న ఆయన.. తమిళ అగ్ర హీరోల్లో ఒకరైన అజిత్ హీరో గా నటించిన 'వలిమై'లో పవర్ ఫుల్ విలన్ పాత్రను పోషించాడు. ఈ పాన్ ఇండియా మూవీ ఈ వారం విడుదల కానుంది.
ఈ సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన కంటే కూడా అజిత్ గొప్పతనం గురించి.. పని పట్ల అతడికున్న కమిట్ గురించిన వివరాలు ఆసక్తికరంగా మారాయి.
ఈ మూవీ షూట్ సమయంలో అజిత్ తో కలిసి చేసిన జర్నీ తనకు ఎన్నో విలువైన విషయాల్ని తెలిపిందని చెప్పాడు. పని పట్ల ఆయనకున్న నిబద్ధతను మాటల్లో చెప్పలేమని.. ఈ సినిమా షూటింగ్ లో రేసింగ్ ఎపిసోడ్స్ ను షూట్ చేసే వేళ.. ఒక ప్రమాదం జరిగిందని చెప్పారు.
ఆ ప్రమాదంలో బైక్ మీద నుంచి అదుపు తప్పి అజిత్ పడిపోయారని.. పెద్ద దెబ్బలే తగిలినా.. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదన్నారు. పడిన బైక్ ను లేపి.. మామూలుగా పక్కన పెట్టేసి వచ్చారే తప్పించి.. ఎలాంటి హడావుడి చేయలేదన్నారు.
తర్వాత తనకు విషయం తెలిసిందే.. ఎందుకు సర్ అంత రిస్కు.. రెండు రోజులు రెస్టు తీసుకోవచ్చుగా అంటే.. అందుకు ఆయన రియాక్టు అయి.. ''ఇప్పుడు నీ డేట్స్ ఉన్నాయి. మళ్లీ నీకు కష్టమవుతుంది. అలాగే ఫైట్ మాస్టర్స్ డేట్స్.. లొకేషన్ ఖర్చులు.. మళ్లీ ఇక్కడకు రావటాలు ఇవన్నీ ఎందుకు? అందరికీ ఇబ్బందే. నేనే కాస్త ఓపిక పడితే సరిపోతుంది కదా'' అని చెప్పారు.
అంత స్థాయిలో ఉండి కూడా పని పట్ల ఎంతటి కమిట్ మెంట్ తో ఉండాలో అజిత్ ను చూస్తే అర్థమైందన్నారు.
ఈ మూవీలో బైక్ రేసింగ్ సీన్లు ఉన్నాయని.. తనకేమో బైక్ రేసింగ్ మీద అవగాహన లేకపోవటంతో ఇబ్బంది పడినట్లు చెప్పారు. స్వతహాగా అజిత్ రేసర్ కావటంతో.. సెట్లో ఆయన వేగాన్ని అందుకోవటం కష్టంగా ఉండేదన్నారు.
యాక్షన్ చెప్పేంతలోపే ఆయన ఎక్కడో ఉండేవారని.. తన ఇబ్బందిని గమనించి.. అజిత్ కాస్త నెమ్మదిగా బైక్ నడిపారన్నారు. సినిమాలో చూపించే సీన్లలో 80 శాతం ఒరిజినల్ గానే చేశామని.. రీస్కీ షాట్లు మాత్రం డూప్ పెట్టినట్లు చెప్పారు.
చూస్తుంటే.. అజిత్ తో పని చేసిన అనుభవం కార్తికేయ ప్రొఫెషనల్ లైఫ్ లో మార్పులు తీసుకురావటం ఖాయమన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు.