తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ వల్ల ఎవరికి పెద్దగా గుర్తింపు దక్కలేదు. కాని రెండవ సీజన్ లో పార్టిసిపెంట్ అయిన కౌశల్‌కు అనూహ్యంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడినది. బిగ్ బాస్ ప్రారంభం అయిన రెండు వారాల్లోనే సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ అంటూ ఒక టీం ఫాం అయ్యింది. అది కాస్త మెల్ల మెల్లగా భారీ ఆర్మీగా మారిపోయింది. కౌశల్ కు మొదట తన అభిమానుల గురించి తెలియదు. కాని ఆమద్య అనసూయ ఇంట్లోకి వెళ్లినప్పుడు ఆ తర్వాత అభిమాని శేఖర్ ద్వారా కౌశల్ కు కౌశల్ ఆర్మీ గురించి తెలిసింది. మొదటి నుండి అందరిని అలరిస్తూ - ఆకట్టుకుంటూ గేమ్ ఆడుతున్న కౌశల్ తాజాగా నిన్నటి ఎపిసోడ్ లో ఎలిమినేషన్ నుండి సేఫ్ అయిన వెంటనే ఎమోషనల్ అయ్యాడు.
నిన్నటి ఎపిసోడ్ లో సేప్ జోన్ లో కౌశల్ అంటూ నాని ప్రకటించిన వెంటనే కౌశల్ మాట్లాడుతూ.. కృషితో నాస్తి దుర్బిక్షం.. కష్టపడి పని చేస్తే ఎలాంటి కార్యంను అయినా సాధించవచ్చు. నాకు మీ అమూల్యమైన సమయంను వెచ్చించి ఓట్లు వేసినందుకు కృతజ్ఞతలు. నా పేరు మీద కొందరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నట్లుగా శేఖర్ అనే బ్రదర్ చెప్పాడు. దయచేసి అలా చేయకండి. నేను చాలా కష్టపడి చేస్తున్న ప్రయత్నం విఫలం అవుతుంది. మీరు చేసే పని వల్ల నా ఆశలు తలకిందులు అవుతాయి. నేను నా తల్లికి మాట ఇచ్చాను. నా తల్లి ఇచ్చిన రూపంకు, తెలివికి ఏదో ఒకటి సాధిస్తాను అంటూ నా తల్లికి ఇచ్చిన మాటను బిగ్ బాస్‌లో గెలిచి నిలబెట్టుకోవాలని భావిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
కౌశల్ ఈ మాటలతో ఆయన ఫ్యాన్స్ మరింతగా ఫిదా అవుతున్నారు. కౌశల్ గొప్పదనంకు - ఆయన చనిపోయిన తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు చేస్తున్న ప్రయత్నంను అభినందించకుండా ఉండలేక పోతున్నాం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కౌశల్ బిగ్‌బాస్ విజేతగా నిలిచే వరకు ఓట్లు వేస్తూనే ఉంటాం అంటూ అభిమానులు చెబుతున్నారు. కౌశల్ ఆర్మీ రేంజ్ ఏంటో తాజాగా హైదరాబాద్‌లో జరిగిన 2కే రన్‌తో తేలిపోయింది.