'ఉస్తాద్' గా కీరవాణి కొడుకు..!

Update: 2022-05-26 07:31 GMT
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి.. 'మ‌త్తు వ‌ద‌ల‌రా' అనే సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. గతేడాది 'తెల్ల‌వారితే గురువారం' చిత్రంతో పలకరించిన సింహా.. 'దొంగలున్నారు జాగ్రత్త' 'భాగ్ సాలే' వంటి ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టాడు. ఈ క్రమంలో తాజాగా మరో చిత్రాన్ని అనౌన్స్ చేసాడు.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన వారాహి చలన చిత్ర బ్యానర్ లో శ్రీ సింహా కోడూరి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. కృషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో భాగం పంచుకుంటోంది. ఈ చిత్రానికి ''ఉస్తాద్'' అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా వెల్లడిస్తూ.. సినిమాకు పనిచేసే సాంకేతిక బృందాన్ని ప్రకటించారు.

'ఉస్తాద్' అనే టైటిల్‌ ను అపారమైన గర్వంతో ఆవిష్కరిస్తున్నాము. మీ హృదయాన్ని కదిలిస్తామని వాగ్దానం చేస్తున్నాము. మీరు ఊహించిన దానికి మించి ఉండబోతోంది. ఇప్పుడు మీ టైమ్‌ లైన్‌లను ఉస్తాదింగ్ చేస్తోంది అని మేకర్స్ ట్వీట్ లో పేర్కొన్నారు.

'ఉస్తాద్' సినిమాతో ఫణిదీప్ అనే నూతన దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. సాయి కొర్రపాటి సమర్పణలో రజినీ కొర్రపాటి - రాకేష్ రెడ్డి గడ్డం - హిమాంక్ రెడ్డి దువ్వూరు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పరన్ కుమార్ పుప్పాల సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. అకీవా మ్యూజిక్ అందిస్తున్నారు. కార్తీక్ కట్స్ ఎడిటింగ్.. ప్రవాలయ ప్రొడక్షన్ డిజైనింగ్ విభాగాలు చూసుకుంటున్నారు. త్వరలోనే 'ఉస్తాద్' సినిమాలో నటించే హీరోయిన్ మరియు ఇతర నటీనటుల వివరాలు వెల్లడించనున్నారు.

శ్రీ సింహ నటించిన 'తెల్ల‌వారితే గురువారం' సినిమా నిర్మాణంలో సాయి కొర్రపాటి భాగం పంచుకున్నారు. ఇప్పుడు 'ఉస్తాద్' సినిమాతో కీరవాణి కుమారుడిని హీరోగా నిలబెట్టే బాధ్యత తీసుకున్నారు. విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ వస్తున్న శ్రీసింహా.. ఈ చిత్రంతో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటారో చూడాలి.

ఇదిలా ఉంటే వారాహి చలన చిత్ర బ్యానర్ లో గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి ని హీరోగా పరిచయం చేస్తున్న ద్విభాషా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ హీరోయిన్ జెనీలియా కీలక పాత్ర పోషిస్తోంది.
Tags:    

Similar News