దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ `ట్రిపుల్ ఆర్`. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలి సారి కలిసి నటించిన భారీ మల్టీస్టారర్ మూవీ ఇది. రిలీజ్ కుముందే భారీ అంచనాలు క్రియేట్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టింది. ఇద్దరు సూపర్ స్టార్ లు కలిసి నటించిన సినిమా కావడంతో దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు `ట్రిపుల్ ఆర్` కు బ్రహ్మరథం పట్టారు. భారీ వసూళ్లు కురిపించారు.
1100 కోట్ల పైచిలుకు వసూళ్లని రాబట్టిన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచలనాలు సృష్టించింది. ఈ చిత్రాన్ని మే 20న ప్రముఖ ఓటీటీ దిగ్గజం జీ5లో స్ట్రీమింగ్ కానున్న విషయం తెలిసిందే. ఇంత వరకు ఈ చిత్రాన్ని చూసిన వారు, చూడని వారు మరో సారి ఓటీటీలో చూడాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే వారందరికి జీ5 గట్టి షాకిచ్చింది. సబ్స్ స్క్రిప్షన్ తీసుకున్నా సరే ఈ సినిమా చూడాలంటే అదనంగా డబ్బు చెల్లించాల్సిందే అంటూ జీ5 కొత్త నిబంధనని పెట్టింది.
దీంతో సినీ ప్రియులు ఓటీటీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నెట్టింట టార్గెట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. పే పర్ వ్యూ విధానంలో ట్రిపుల్ ఆర్ జీ5లో అందుబాటులోకి రానుందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అభిమానులు నెట్టింట జీ5ని ట్రోల్ చేస్తున్నారు. ఇదిలా వుంటే `కేజీఎఫ్ 2` కూడా ఇదే బాటలో పయనిస్తూ ట్రిపుల్ ఆర్ ని ఫాలో అవుతోంది. ట్రిపుల్ ఆర్ తరహాలోనే `కేజీఎఫ్ 2`ని కూడా పే పప్ వ్యూ విధానంలో రిలీజ్ చేశారు.
ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా `కేజీఎఫ్ 2` ని అమెజాన్ ప్రైమ్ వీడియో చడీ చప్పుడు కాకుండా రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో పే పర్ వ్యూ విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ లో చూడాలంటే అదనంగా ప్రతీ వ్యూకి రూ.199 చెల్లించాల్సిందే. ఇప్పటికే స్ట్రీమింగ్ మొదలు కావడంతో చాలా మంది అభిమానులు, సినీ ప్రియములు అమెజాన్ ప్రైమ్ పై కామెంట్ లు చేస్తున్నారు. మొత్తం ఐదు భాషలకు సంబంధించిన వెర్షన్ లని పే పర్ రెంట్ విధానంలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. 48 గంటల్లో ఎప్పుడైనా సినిమాని చూడొచ్చని, అయితే ఆ తరువాత చూస్తానంటే కుదరదని అమెజాన్ కండీషన్ పెట్టింది.
ఇలా చడీ చప్పుడు కాకుండా అమెజాన్ ప్రైమ్ లో ఐదు భాషలకు సంబంధించిన కేజీఎఫ్ 2 ప్రింట్ ని స్ట్రీమింగ్ చేస్తుండటంతో సినీ ప్రియులు షాకవుతున్నారు. ఏడాది చందా కట్టి ఆమెజాన్ ప్రైమ్ లో ఎంచక్కా కేజీఎఫ్ 2 రిలీజ్ అయితే చూసేయోచ్చని భావించిన వారంతా తాజా విధానంతో ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు. ఏడాది చందాతో పాటు `కేజీఎఫ్ 2` స్ట్రీమింగ్ కు అదనంగా మరో రూ.199 కట్టి చూడాలనడం మరీ దారుణం అని మండిపడుతున్నారు. అయితే ఓటీటీ దిగ్గజాలు మాత్రం ఎక్కడా తగ్గేదిలే అంటూ క్రేజీ సినిమాలని కొత్త విధానాన్ని అమలుకు పావులుగా వాడుకుంటుండటం సంచలనంగా మారింది.