కన్నడ సూపర్ సెన్షేషనల్ మూవీ కేజీఎఫ్ కు సీక్వెల్ గా రూపొందుతున్న కేజీఎఫ్ 2 సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. అంతా అనుకున్నట్లుగా జరిగితే సినిమాను ఈనెలలో విడుదల చేయాల్సి ఉంది. కాని కరోనా కేజీఎఫ్ మేకర్స్ ప్లాన్ మొత్తం మార్చేసింది. సినిమా షూటింగ్ దాదాపు ఆరు నెలలు జరుగలేదు. గత నెలలోనే షూటింగ్ ను ప్రారంభించారు. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న సంజయ్ దత్ క్యాన్సర్ బారిన పడటంతో షూటింగ్ విషయంలో అనేక అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
సంజయ్ దత్ ఒక వైపు క్యాన్సర్ ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే మరో వైపు ఒక హిందీ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఆ కారణంగా కేజీఎఫ్ 2 లో కూడా నటించే అవకాశం ఉందని అంతా భావించారు. కాని కన్నడ మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సంజయ్ దత్ లేకుండానే షూటింగ్ ను పూర్తి చేయబోతున్నారట. ఆయన ఆరోగ్యం దృష్ట్యా ప్రస్తుతం ఆయన్ను ఇబ్బంది పెట్టాలనుకోవడం లేదట. అందుకే షూటింగ్ లో ఆయన స్థానంలో డూప్ ను పెట్టి చిత్రీకరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఇప్పటికే మెజార్టీ పార్ట్ లో సంజయ్ దత్ నటించేశాడు. కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా డూప్ తో మాయ చేసి సంజయ్ దత్ పాత్ర షూటింగ్ ను పూర్తి చేయాలనే నిర్ణయానికి వచ్చారట. నవంబర్ వరకు సినిమాను పూర్తి చేసి జనవరి లేదా ఫిబ్రవరి వరకు సినిమాను విడుదల చేయాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రయత్నాలు చేస్తున్నాడు. కేజీఎఫ్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో కేజీఎఫ్ 2 సినిమాపై అంచనాలు మరింతగా ఉన్నాయి. మరో బాహుబలి రేంజ్ లో కేజీఎఫ్ 2 వసూళ్ల రాబడుతుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.