చిత్రం :కెజిఎఫ్ ఛాప్టర్ వన్
నటీనటులు - యష్-శ్రీనిధి శెట్టి-అనంత్ నాగ్-అచ్యుత్ కుమార్-మాళవిక అవినాష్-శ్రీనివాస మూర్తి-అశ్వంత్-వశిష్ట తదితరులు
సంగీతం - రవి బస్నూర్-తనిష్క్ బాగ్చి
ఛాయాగ్రహణం - భువన్ గౌడ
ఎడిటింగ్ - శ్రీకాంత్
ఆర్ట్ డైరెక్టర్ : శివకుమార్
నిర్మాణం : వారాహి - హోంబాలె
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం - ప్రశాంత్ నీల్
సాధారణంగా పరిమిత బడ్జెట్ లో రూపొందే కన్నడ సినిమాలకు జాతీయ స్థాయిలో మార్కెట్ ఎన్నడూ ఏర్పడలేదు. ఆ పరిమితి వల్లే వాటి డబ్బింగులు కూడా చాలా అరుదుగా జరిగేవి. కానీ కెజిఎఫ్ ఈ ట్రెండ్ కి భిన్నంగా ఏకంగా ఐదు భాషల్లో విడుదలకు సిద్ధపడి అందులో ఉన్న రా కంటెంట్ తో దేశవ్యాప్తంగా సినిమా ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. నిన్నటి దాకా కర్ణాటక బయట ఎవరికి పెద్దగా పరిచయం లేని హీరో యష్ కెజిఎఫ్ ద్వారానే అందరి దృష్టిలో పడ్డాడు. శాండల్ వుడ్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాగా ప్రత్యేకతను సంతరించుకున్న కెజిఎఫ్ ఈ రోజు ప్రేక్షకుల తీర్పు కోసం వచ్చింది. విపరీతమైన పోటీ మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడిన కెజిఎఫ్ మెప్పించిందా లేదా రివ్యూలో చూద్దాం పదండి
కథ:
ఇది 1951లో మొదలై 1981 దాకా సాగే కథ. ఎలా పుట్టాం అనే కంటే పోయేటప్పుడు మాత్రం ధనవంతుడిగా చావాలన్న అమ్మ మాటను నరనరాల్లో జీర్ణించుకున్నరామకృష్ణ పవన్ అలియాస్ రాకీ(యష్) బాల్యం నుంచే ఆ కసితో ఎదుగుతూ ఉంటాడు. ముంబై వీధుల్లో మొదలైన అతని ప్రయాణం డాన్ గా చెలామణి అవుతున్న శెట్టి సహకారంతో ముంబై స్మగ్లింగ్ తో పాటు ఆఫ్రికా నుంచి దిగుమతి అవుతున్న దొంగ బంగారం మీద ఆధిపత్యం సాగించేలా చేస్తుంది. ఇంకా పెద్దగా ఎదగాలి అనుకున్న రాకీ కోలార్ లో ఉన్న నరాచి మైనింగ్ కార్పొరేషన్ ని తన గుప్పెట్లో పెట్టుకున్న గరుడ(రామచంద్ర రాజు)ను చంపే అసైన్మెంట్ మీద బెంగుళూరు వస్తాడు. రాగానే రాజేంద్ర దేశాయ్(లక్ష్మణ్) కూతురు నీనా(శ్రీనిధి శెట్టి)ప్రేమలో పడతాడు. అలా పక్కా స్కెచ్ తో ఒక్కో అడుగు వేస్తూ శత్రుభేద్యమైన కోలార్ బంగారు గనుల్లో బాససగా అడుగు పెడతాడు. ఆ సామ్రాజ్యానికి చక్రవర్తి కావాలనే లక్ష్యం ఎంత వరకు నెరవేర్చుకున్నాడు అనేదే కెజిఎఫ్
కథనం - విశ్లేషణ:
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కు చాలా ప్రత్యేకమైన చరిత్ర ఉంది. దాని వెనుక అంతులేని అరాచకం విషాదం చరిత్రలో కలిసిపోయింది. ఇతర రాష్ట్రాల వాళ్లకు అవగాహన లేకపోయినా భారతదేశపు ఏకైక బంగారు నిక్షేపాలు ఉన్న ప్రదేశంగా దీనికి పెద్ద నేపధ్యం ఉంది. దర్శకుడు ప్రశాంత్ దీన్ని రెండున్నర గంటల సినిమాగా ఆవిష్కరించే ప్రయత్నం చేయడం నిజంగా సాహసమే. బయటి ప్రపంచానికి తెలియని నిజాలను స్టార్ ఇమేజ్ ఉన్న ఒక హీరోతో ఇంత భారీ బడ్జెట్ తో చూపించాలనుకున్న ధైర్యానికి ఆశ్చర్యం కలుగుతుంది. కంటెంట్ ను నమ్ముకున్నారు కాబట్టే ప్రశాంత్ అయినా యష్ అయినా ఇంత రిస్క్ కు సిద్ధపడ్డారు. వీధుల్లో బాల్యాన్ని మొదలుపెట్టి చీకటి సామ్రాజ్యాన్ని ఏలడం అనే కాన్సెప్ట్ కొత్తదేమీ కాదు.
గతంలో బాలీవుడ్ లో ఇదే తరహా బ్యాక్ డ్రాప్ లో ఒన్స్ అపాన్ ఏ టైం ఇన్ ముంబై లాంటి సినిమాలు బోలెడు వచ్చాయి. హిట్ అయ్యాయి కూడా. కానీ సౌత్ లో ఇలాంటివి అరుదుగా వస్తుంటాయి. అందుకే కెజిఎఫ్ రెగ్యులర్ మూవీ అనే ఫీలింగ్ ట్రైలర్ నుంచే కలిగించలేదు. అందుకే దీని మీద ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి. అయితే ప్రశాంత్ నీల్ కథను చెప్పే క్రమంలో నాన్ లీనియర్ పద్ధతిని ఎంచుకోవడం ఒకరకంగా సినిమాలో ఫ్లోని బాగా దెబ్బ తీసింది. పికప్ అవుతోంది అనుకుంటున్న టైంలో ఉన్నట్టుంది చైల్డ్ హుడ్ ఎపిసోడ్స్ చూపించడం, రాకీ కథను ఒక జర్నలిస్ట్ చెబుతున్నట్టుగా మధ్య మధ్యలో సడన్ బ్రేకులు వేయడం లాంటివన్నీ పంటి కింద రాళ్ళలా అడ్డుపడతాయి.
ఇది సీక్వెల్ ఉన్న స్టోరీ. అందుకే ప్రశాంత్ కథను చెప్పే క్రమంలో హడావిడి పడలేదు. హీరోకు డబ్బు కావాలన్న కాంక్షను బలంగా రిజిస్టర్ చేయడం కోసం కావలసినంత టైం తీసుకున్నాడు. యష్ మీదున్న అభిమానం వల్ల కన్నడ ప్రేక్షకులకు ఇదంతా ఓకే అనిపిస్తుంది కానీ మనకు మాత్రం ప్రహసనంగా అనిపిస్తుంది. కాకపోతే ఎమోషన్ ని ఎక్కడిక్కడ బాలన్స్ చేసే ప్రయత్నం చేయడంతో మరీ బోర్ కొట్టకుండా సాగుతుంది. కోలార్ లో అంత దుర్మార్గం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చేసింది అనే ప్రశ్నలు మదిలో తలెత్తినా అలాంటి లాజిక్స్ కు ఎక్కువ అవకాశం ఇవ్వకుండా ప్రశాంత్ నీల్ చాలా తెలివిగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు.
అయితే ఇది రెండు భాగాలుగా చూపాలన్న టార్గెట్ ముందే పెట్టుకున్నారు కాబట్టి ఫస్ట్ హాఫ్ మొత్తం బాగా సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇంటర్వెల్ వచ్చాకే రాకీకి కోలార్ గోల్డ్ మైన్స్ లో అడుగు పెట్టాలన్న లక్ష్యం ఏర్పడుతుంది. అప్పటి దాకా అర్థం లేని హీరోయిన్ ఎపిసోడ్ తో పాటు చీటికీ మాటికీ రాకీ పాత్రను అతిగా ఎలివేట్ చేయడంలో టైం వేస్ట్ చేయడం మైనస్ గా నిలిచింది. పైగా మసాలాలు ఉండకపోతే ఫ్యాన్స్ ఒప్పుకోరనే కారణంతో ఇరికించిన పాటలు ఏ మాత్రం ప్లస్ కాలేకపోయాయి. రాకీ అంత పవర్ ఫుల్ గా దేశంలో మాఫియా మొత్తం భయపడేలా చూపించిన క్రమం పూర్తి కన్విన్సింగ్ గా అనిపించదు.
అయితే సెకండ్ హాఫ్ మొదలయ్యాక కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ లో కట్టిపడేసే ఆర్ట్ వర్క్ మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. అక్కడ యాక్షన్ ఎపిసోడ్స్ బాగా ఎలివేట్ అయ్యాయి కానీ అవసరం లేని ట్రాక్స్ ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయడంతో ఇదో క్లాసిక్ గా నిలిచే అవకాశాన్ని పూర్తిగా వాడుకోలేకపోయింది. కథనంలో తడబాటులో ఫస్ట్ హాఫ్ విపరీతంగా కనిపిస్తే సెకండ్ హాఫ్ లో హీరో విలన్ ని చంపాలి అనే చిన్న పాయింట్ తప్ప ఇంకే కథ లేకపోవడంతో మలుపులు అవకాశం లేకుండా పోయింది. ఎమోషన్ విషయంలో మాత్రం ప్రశాంత్ నీల్ సక్సెస్ కాలేకపోయాడు
నటీనటులు:
బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్ స్టార్ దాకా ఎదిగిన నటుడు యష్. తక్కువ కాలంలో ఇంత ఇమేజ్ దక్కించుకోవడం అంటే ,మాటలు కాదు. అందుకే లార్జర్ దాన్ లైఫ్ లాంటి రాకీ పాత్రను ఎంచుకుని మరో పది మెట్లు ఎక్కేసాడు. ఇప్పటిదాకా కమర్షియల్ పాత్రలకు కట్టుబడిన యష్ దీంతో సరికొత్త మజిలీకి తెరతీశాడు. గుబురు గెడ్డంతో సడన్ గా చూస్తే రంగస్థలంలో రామ్ చరణ్ పోలికలు కనిపించే యష్ కు ఇందులో మరీ ఛాలేంజింగ్ అనిపించే సన్నివేశాలు లేవు. విజువల్ గ్రాండియర్ తో పాటు ఇతర హంగులు ఆకర్షణీయంగా ఉండటంతో రాకీగా తనకు ఎక్కువ పని లేకుండా పోయింది. ఎలాంటి హావభావాలు లేకుండా సీరియస్ గా తన లక్ష్యాన్ని మాత్రమే అనుసరించే కరుడు గట్టిన గ్యాంగ్ స్టర్ గా పర్ఫెక్ట్ గా చేసాడు. బహుశా ఇతని టెర్రిఫిక్ పెర్ఫార్మన్స్ అంతా సెకండ్ చాప్టర్ కోసం తీసిపెట్టుకున్నాడేమో దర్శకుడు
హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఏ రకంగానూ ఆకర్షణ కాలేకపోయింది. అటు పెరఫార్మన్స్ ఇవ్వడానికి ఛాన్స్ లేకపోవడంతో పాటు మరీ పీలగా ఉండటంతో ఏదో మొక్కుబడిగా హీరోయిన్ ఉండాలి కాబట్టి ఉందనిపించే తనకు కెజిఎఫ్ వల్ల ఒరిగింది శూన్యం. మెయిన్ విలన్ రామ చంద్రరాజు బాగానే భయపెట్టాడు. అతనికి నమ్మిన బంటుగా సాయి కుమార్ తమ్ముడు అయ్యప్ప శర్మ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. సెకండ్ హాఫ్ లో తన ఉనికిని చాటుకున్నాడు. జర్నలిస్ట్ గా కథ చెప్పేది అనంత నాగ్ కాబట్టి ఆయన గుర్తుండిపోతాడు. ఇతర విలన్లు వినయ్ బిడప్పా-దినేష్ మంగళూరు-అవినాష్-హరీష్ రాయ్-వశిష్ట తదితరులు అవసరానికి తగ్గట్టు నటించేసి మైనస్ కాకుండా నిలిచారు
సాంకేతిక వర్గం:
దర్శకుడు ప్రశాంత్ నీల్ అనుకున్న పాయింట్ బాగున్నా దాని తెరమీద అంతే ఇంటెన్సిటీతో చూపడంలో పూర్తిగా సక్సెస్ కాలేకపోయాడు. ఇలాంటి కథలకు కావాల్సిన డెప్త్ ఎమోషన్ ని ప్రేక్షకుల మనస్సులో రిజిస్టర్ చేయడంలో సగం మార్కులే తెచ్చుకోవడంతో కేజిఎఫ్ ని భారీతనం ఉన్న ఓ సగటు సినిమాగా మిగిల్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం రాకీ పాత్రను బిల్డప్ చేయడానికి టైం తీసుకున్న ప్రశాంత్ దానికి తగ్గట్టు కట్టిపడేసే ఎపిసోడ్స్ ఓ రెండు మూడు రాసుకున్నా దీని రేంజ్ ఎక్కడికో వెళ్ళేది. రాకీ ప్రేమలో పడటం తలాతోకా లేకుండా సాగితే అతను చాలా సులభంగా ఓ ఫైట్ చేసేసి కోలార్ ఫీల్డ్స్ లోకి హీరో లెవెల్ లో ఎంటరైపోవడం నమ్మశక్యం కాని రీతిలో ఉన్నాయనినిపించదంటే దానికి స్క్రీన్ ప్లే లోపమే కారణం.
మెస్ మరైజ్ చేసే మేజిక్ ఉన్నప్పుడు లాజిక్స్ ఎవరూ అడగరు. అది తగ్గినప్పుడే లేనిపోని అనుమానాలు వస్తాయి. అయినా కూడా ప్రశాంత్ నీల్ పూర్తిగా నిరాశ పరచలేదు కాని కేజిఎఫ్ ని ఓ స్థాయిలో ఊహించుకున్న ప్రేక్షకులను పూర్తిగా సంతృప్తిపరచలేకపోయాడు. అయినప్పటికీ అతనిలో ఉన్న టెక్నీషియన్ కన్నడ సినిమా స్థాయి పెరిగింది అని చెప్పడానికి మాత్రం బాగా ఉపయోగపడింది. రవి బస్నూర్-తనిష్క్ ల బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమా మూడ్ ని బాగా క్యారీ చేసింది కాని పాటలు కనీస స్థాయిలో కూడా లేవు. ఏదో రొదలా అనిపిస్తాయి తప్ప ఇంకే విశేషమూ లేదు. తమన్నా సాంగ్ వృధా అయిపోయింది. ఆన్ లైన్ లో వదిలిన మౌని రాయ్ పాటను ఎందుకో మరి లేపేశారు. బహుశా రెండూ ఐటెం సాంగ్స్ అవుతాయన్న కారణం కావొచ్చు.
ఇక ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది భువన గౌడ ఛాయాగ్రహణం గురించి. ముంబై బ్యాక్ డ్రాప్ లో ఫస్ట్ హాఫ్ ని ఊహల్లో మాత్రమే చూడడానికి సాధ్యమయ్యే కోలార్ బంగారు గనుల నేపధ్యాన్ని రెండు విభిన్నమైన కలర్ స్కీంస్ లో చూపించిన తీరు టాప్ స్టాండర్డ్ లో ఉంది. తనకు వంక పెట్టే అవకాశం ఎక్కడా ఇవ్వలేదు. అందరి కంటే ఎక్కువ ప్రశంశలకు అర్హుడు ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్. కోలార్ సెటప్ ని తీర్చిదిద్దిన తీరు అవార్డులు తెచ్చిపెట్టినా ఆశ్చర్యం లేదు. విజువల్ ఎఫెక్ట్స్ సహకారం తీసుకున్నా చాలా సహజంగా అనిపించేలా ఆనాటి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టు పునఃసృష్టి చేసిన తీరు అభినందనీయం. శ్రీకాంత్ ఎడిటింగ్ ఇంకొంచెం పదునుగా ఉంటె అవసరం లేని చైల్డ్ ఎపిసోడ్స్ కు కోత పడి ఇంకా క్రిస్పి గా మారేది. ఒరిజినల్ నిర్మాత హోంబాలే నిర్మాణ విలువలు భారీగా ఉన్నాయి. వారాహి వారు బహుశా ఇది చూసే ఈ రేంజ్ లో విడుదల చేసేందుకు ముందుకు వచ్చుంటారు
కేజిఎఫ్ చాప్టర్ వన్ ఒక విభిన్నమైన అనుభూతిని కలిగించే గ్యాంగ్ స్టర్ మూవీ. ఇంతవరకు తెరపై బంగారు గనుల నేపధ్యంలో సినిమా రాలేదు కానీ ఇలాంటి మాఫియా కథలతో చాలా వచ్చాయి. ఆరకంగా చూసుకుంటే కేజిఎఫ్ ఒక సగటు సినిమాలాగే అనిపిస్తుంది.విజువల్ గా హై స్టాండర్డ్ లో తీర్చిదిద్దినా కంటెంట్ లో అంత డెప్త్ లేకపోవడంతో పాటు ఇది అసంపూర్తిగా ముగిసే మొదటి భాగం కాబట్టి బాహుబలి తరహాలో రెండో పార్ట్ కోసం ఉత్సుకతతో ఎదురు చేసే ఛాన్స్ ఇవ్వలేకపోయింది. మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకోకుంటే తప్ప కేజిఎఫ్ పూర్తిగా మెప్పించడం కష్టం
చివరగా: కేజిఎఫ్ చాప్టర్ వన్ - భారీతనం ఓకే - కథనం వీకే
రేటింగ్ : 2.5 / 5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre
Full View