అలా గడ్డం కోసం కేర్ తీసుకుంటాడట

Update: 2019-05-13 12:10 GMT
ఈమధ్య హీరోలు గడ్డం లుక్ లో కనిపించడం చాలా కామన్ అయిపోయింది. టాలీవుడ్ లో అయితే హీరో గడ్డం లుక్ లో కనిపిస్తే చాలు.. హిట్ కొట్టేస్తున్నారనే సెంటిమెంట్ కూడా బలపడిపోయింది. అయితే మనం హీరోల గడ్డాలు వేరు కన్నడ స్టార్ హీరో యష్ గడ్డం వేరు.  అది గడ్డాలకే పెద్ద గడ్డం.  అసలు 'కేజీఎఫ్' సినిమాలో యష్ అంత రఫ్ గా.. రగ్డ్ గా కనిపించడానికి కారణం ఆ గుబురు గడ్డమే. ఇక 'కేజీఎఫ్ చాప్టర్ 2'  కోసం యష్ తన గడ్డాన్ని మరింతగా పెంచాడు. జుట్టు కూడా పెంచాడు లెండి.

అయితే ఈ గడ్డం కోసం యష్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటాడో తెలుసా? ఏదో పెరుగుతోంది కదా అన్నటుగా దాన్ని అలా వదిలేయడట.  శుభ్రంగా ఉండడం కోసం రెగ్యులర్ గా షాంపూ చేస్తాడట.. పొడిబారకుండా ఉండేందుకు బియర్డ్ ఆయిల్ అప్లై చేస్తాడట.  మరి అందుకే గడ్డాన్ని చూస్తే అబ్బాయిలకే కాదు అమ్మాయిలకు కూడా ముచ్చటేస్తుంది. ఆ గడ్డం లుక్ యష్ కు సూట్ అయినట్టుగా వేరెవరికీ సెట్ అవదేమో అనిపిస్తుంది.

ఇదిలా ఉంటే మన ఇళ్ళలో కాస్త గడ్డం పెంచుకుంటే ఒకవైపు అమ్మ.. మరోవైపు అక్కలు చెల్లెళ్ళు.. (ఉంటే గింటే) భార్య ఎలా మనలని 'షేవింగ్ చేసుకో.. చూడలేక చస్తున్నాం' అని డైలాగులు వేసి వేధిస్తూ ఉంటారో.. యష్ కు కూడా అలాంటి పరిస్థితే ఉందట.  ఒక వైపు భార్య రాధిక పండిట్.. మరోవైపు యష్ బ్రదర్ 'క్లీన్ షేవ్ చేసుకోవచ్చుగా" అని అడుగుతూనే ఉంటారట! ఊరు పేరు లేని ఉత్త గడ్డాలకే కాదు.. రాకింగ్ స్టార్ గారి స్టైలిష్ కేజీఎఫ్ గడ్డానికి కూడా కష్టాలు తప్పడం లేదు..!
Tags:    

Similar News