షాహిద్ సోదరుడు ఇషాన్ ఖత్తర్.. అనన్య పాండే జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఖాళీ పీలీ`. మక్బూల్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ యాక్షన్ చిత్రమిది. అలీ అబ్బాస్ జాఫర్ - హిమాన్షు మెహ్రా నిర్మించారు. ఈ చిత్రాలలో జైదీప్ అహ్లవత్ విలన్ గా నటించారు. ఈ చిత్రం ఓటీటీ ZEE 5 లో విడుదల కానుంది.
ఇద్దరు చిన్నపుడే విడిపోయిన స్నేహితులు చాలాకాలానికి ఎలాంటి పరిస్థితుల్లో కలిసారు? అన్నదే ఈ సినిమా. చిన్ననాటి ప్రియురాలు పూజాకి ఎదురైన పరిస్థితులు ఏమిటి? వేశ్యగా మారిన పూజ 18 ఏళ్ళ వయసులో వేశ్యాగృహం నుండి తప్పించుకునే క్రమంలో ఎవరు పరిచయం అయ్యారు? అన్నదే ట్విస్ట్. వేశ్య గృహం నుంచి పారిపోతూ దొంగిలించిన డబ్బు బ్యాగ్ తో పారిపోతూ ‘చాలు’ అనే బొంబాయి టాక్సీ డ్రైవర్ కార్ లోకి ప్రవేశిస్తుంది పూజా. పెద్ద మొత్తం డబ్బు ఇస్తానంటే ఆ ట్యాక్సీని నడిపించేందుకు అతడు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత పూజాను వెంటాడుతూ గూండాలు.. వారిని వెంటాడుతూ ఉన్న పోలీసులతో పోరాటం ఎలా సాగింది? తప్పించుకునే క్రమంలో ఏం జరిగింది? అన్నది తెరపై చూపిస్తున్నారు.
తాజాగా రిలీజ్ చేసిన టీజర్ ఆద్యంతం నాయకానాయికలు ట్యాక్సీలో వెళుతుంటే ఛేజ్ దృశ్యాలతో రక్తి కట్టించింది. ఇది ఎలుకా పిల్లి ఆట తరహా కావడంతో ఆద్యంతం రక్తి కట్టించనుందనే అర్థమవుతోంది. టీజర్ లో ఇషాన్ యాక్షన్ చూస్తుంటే చాలా హార్డ్ వర్క్ చేశాడనే అర్థమవుతోంది. క్రైసిస్ వల్ల థియేట్రికల్ రిలీజ్ లేదు. ఓటీటీలో రిలీజైపోతోంది.
Full View