క్లైమాక్స్ కి ఖిలాడీ.. సాంగ్ షూట్ లో బిజీ

Update: 2021-12-29 09:38 GMT
మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో `ఖిలాడీ` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు సినిమాపై మంచి హైప్ ని తీసుకొచ్చాయి. ర‌వితేజ్ ఇమేజ్ కి త‌గ్గ‌ట్టు ప‌క్కా మాస్ కంటెంట్ తోనే చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. `ఖిలాడీ` టైటిల్ కి మాస్ రాజా స‌రైన జ‌స్ట్ ఫికేష్ ఇస్తాడ‌న్న కాన్ఫిడెంట్ ని టీమ్ వ్య‌క్తం చేస్తుంది. తాజాగా సినిమా సంబంధించిన అప్ డేట్ ని యూనిట్ అందించింది. చివ‌రి పాట షూటింగ్ జ‌రుగుతుంది. ఈ పాట మిన‌హా టాకీ పార్ట్ ..ప్యాచ్ వ‌ర్క్ కూడా పూర్త‌యింది. మ‌రోవైపు నిర్మాణ‌నంత‌ర ప‌నులు జ‌రుగుతున్నాయి.

అభిమానుల అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా సినిమా ఉంటుంద‌ని చిత్ర దర్శ‌కుడు రివీల్ చేసారు. అన్ని ప‌నులు పూర్తిచేసి సినిమాని ఫిబ్ర‌వ‌రి 11న రిలీజ్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. అదే నెల‌లో మెగాస్టార్ చిరంజీవి న‌టించి ఆచార్య కూడా రిలీజ్ అవుతుంది. అయితే వారం గ్యాప్ లో ఈ రెండు రిలీజ్ అవుతున్నాయి కాబ‌ట్టి ఇబ్బంది ఉండ‌దు. ఖిలాడీలో ర‌వితేజ‌కి జోడీగా మీనాక్షి చౌద‌రి..డింపుల్ హ‌య‌తి న‌టిస్తున్నారు. ఇంకా అర్జున్ స‌ర్జా..ఉన్ని ముకుంద‌న్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. పెన్ మూవీస్- ఏస్టూడియోస్ ప‌తాకాల‌పై కొనేరు స‌త్యన్నారాయ‌ణ‌.. ర‌మేష్ వ‌ర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు.

`ఖిలాడీ`నే గాక మాస్ రాజా మ‌రో రెండు చిత్రాల షూటింగ్ ల‌తోనూ బిజీగా ఉన్న సంతి తెలిసిందే. `రామారావు ఆన్ డ్యూటీ`..`ధ‌మాకా` చిత్రాల్లో న‌టిస్తున్నారు. రెండు సినిమాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. రామారావు చిత్రానికి శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. `ధ‌మాకా` చిత్రానికి త్రినాధ‌రావు న‌క్కిన‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ రెండు కూడా ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలే. వ‌రుస హిట్ల‌తో తిరిగి ఫామ్ ని కొన‌సాగించాల‌ని రాజా ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు.
Tags:    

Similar News