‘శైలజ’ మ్యాజిక్ రిపీటవుతుందా?

Update: 2017-10-26 23:30 GMT
తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న మరో సినిమా విడుదలకు సిద్ధమైంది. రామ్ కథానాయకుడిగా ‘నేను శైలజ’ దర్శకుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తన ఇమేజ్‌.. లుక్‌ కు సరిపోయే పాత్రలు ఎంచుకోకుండా మాస్ హీరో అయిపోదామన్న తాపత్రయంతో రామ్ చేసిన సినిమాలు వరుసగా ఫ్లాపై.. ఏం చేయాలో పాలుపోని సమయంలో ‘నేను శైలజ’తో అతడికి మంచి విజయాన్నందించాడు కిషోర్. ఆ సినిమాలో అందరికీ సరికొత్త రామ్ కనిపించాడు. రామ్ ఎలాంటి పాత్రలు చేస్తే బాగుంటుందో.. అందరికీ జనాలకు నచ్చుతాడో ఆ సినిమాతో అందరికీ అర్థమైంది.

కానీ రామ్ మాత్రం ఆ విషయాన్ని అర్థం చేసుకోలేక మళ్లీ హైపర్ యాక్టివ్ పాత్ర చేశాడు ‘హైపర్’లో. దాని ఫలితమేంటో తెలిసిందే. ఐతే తన తప్పేంటో తెలుసుకుని మళ్లీ కిషోర్ దర్శకత్వంలో ‘ఉన్నది ఒకటే జిందగీ’ చేశాడు. ఈ సినిమా ట్రైలర్ చూస్తే.. ‘నేను శైలజ’ తరహాలోనే మరోసారి మంచి ఫీల్ ఉన్న సినిమా చూడబోతున్నామన్న ఫీలింగ్ కలిగింది. ‘నేను శైలజ’లో ప్రేమకు ఫ్యామిలీ ఎమోషన్లు జోడించి మెప్పించిన కిషోర్.. ఈసారి లవ్ స్టోరీకి ఫ్రెండ్ షిప్ స్టోరీని జత చేశాడు. ఈ కథలో స్నేహానికి కూడా ప్రాధాన్యం ఉంటుందట. హీరోయిన్లతో పాటు ఫ్రెండుగా శ్రీవిష్ణు పాత్ర కీలకమంటున్నారు. ఈ సినిమా గురించి చిత్ర బృందమంతా చాలా గొప్పగా చెప్పుకుంది. మరి అంత గొప్పగా సినిమా ఉంటుందా.. ‘నేను శైలజ’ మ్యాజిక్ రిపీటవుతుందా లేదా అన్నది ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది.
Tags:    

Similar News