#KM: బూతు పదంతో ధమ్కీ ఇచ్చిన విశ్వక్ సేన్..!

Update: 2022-11-10 13:30 GMT
'ఈ నగరానికి ఏమైంది' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన యువ హీరో విశ్వక్ సేన్.. 'ఫలక్‌ నుమా దాస్' చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నాడు. అప్పటి నుంచి సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక సినిమాలతోపాటుగా తన యాటిట్యూడ్ తోనూ మాస్ కా దాస్ విశ్వక్ యూత్ లో ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే అతను మాట్లాడే మాటలు.. ప్రచార కార్యక్రమాలు లేనిపోని వివాదాలు సృష్టిస్తూ వార్తల్లో నిలిచేలా చేస్తుంటాయి.

లేటెస్టుగా యాక్షన్‌ కింగ్ అర్జున్‌ తో వివాదం మరోసారి విశ్వక్ సేన్ ని వార్తల్లో నిలిపింది. విశ్వక్ కు కమిట్మెంట్ లేదని.. అన్ ఫొఫెషనల్ యాక్టర్ అని అర్జున్ తీవ్ర అసహనం వ్యక్తం చేసారు. అతని వల్ల తనకు అవమానం జరిగిందని.. ఇకపై విశ్వక్ తో వర్క్ చేయలేనని తేల్చి చెప్పారు. దీనిపై విశ్వక్ కూడా వివరణ ఇచ్చారు.

ఈ వివాదంతో గత నాలుగు రోజులుగా మీడియాలో సోషల్ మీడియాలో విశ్వక్ సేన్ విషయాలు హాట్ టాపిక్ గా మారాయి. ఇందులో తప్పొప్పుల గురించి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా ఓ బూతు పదంతో వచ్చాడు మాస్ కా దాస్.

విశ్వక్ సేన్ గత రాత్రి ట్వీట్ చేస్తూ.."#KM (hint : M - mui)" అని పేర్కొన్నాడు. దీనికి 'ధమ్కి ఆన్ ది వే' అంటూ ఓ చిన్న వీడియో క్లిప్ ని జోడించాడు. దీన్ని బట్టి యువ హీరో తన రాబోయే చిత్రం "ధమ్కీ" లో కస్ వర్డ్‌ తో వస్తున్నాడని తెలుస్తోంది.

#KMలో M అంటే ముయ్ అని హింట్ ఇచ్చి.. K అంటే ఏమిటో అర్థం చేసుకోవచ్చని విశ్వక్ ట్వీట్ ద్వారా చెప్పాడు. K అంటే ఏంటి.. KM అనే సంక్షిప్త పదం వెనుక ఉన్న అసభ్యకరమైన బూతు గురించి అందరికీ తెలుసు.

విశ్వక్ KM ట్వీట్ పై భిన్నభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. దీని కింద పలువురు నెటిజన్లు ఆ కస్ పదాన్ని సమాధానంగా పెడుతున్నారు. K అంటే KCPD లో K కదా? అని ఓ నెటిజన్ కామెంట్ చేసాడు. మరికొందరు హీరో మీద విరుచుకు పడుతున్నారు.

గతంలో విశ్వక్ తన 'ఫలక్‌ నుమా దాస్‌' సినిమాలో నేరుగా ఎక్కువ కస్‌ పదాలు వాడడం పెద్ద చర్చనీయాంశమైన సంగతి అందరికి తెలిసిందే. ఇప్పుడు KM అనే బూతును తన "ధమ్కి" సినిమాలో పెడుతున్నాడని అర్థమవుతోంది.

విశ్వక్ స్వీయ దర్శకత్వంలో ‘దాస్ కా ధమ్కీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదొక పాన్ ఇండియా సినిమా. ఇందులో హీరోగా నటించడంతో పాటు తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. దీపావళి సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ధమ్కీ టీజర్ ఇవ్వడానికి విశ్వక్ సేన్ రెడీ అవుతున్నాడు. మరి ఇందులో KM పదం ఉంటుందా? ఉంటే దానిపై ఎ లాంటి అభ్యంతరాలు వ్యక్తం అవుతాయి? అనేది చూడాలి. ఇకపోతే గత కొన్ని రోజలుగా తనని ట్రోలింగ్ చేస్తున్న వారిని ఉద్దేశించే యువ హీరో ఆ పదాన్ని ట్వీట్ చేసి ఉంటాడని కొందరు నెటిజన్లు అభిప్రయపడుతున్నారు.

"ధమ్కీ" సినిమాలో విస్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది. రోహిణి - రావు రమేశ్ - పృథ్వీరాజ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇది తన ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావటంతో విశ్వక్ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News