వచ్చే ఏడాది రెంటిని ప్లాన్‌ చేస్తున్న సూపర్‌ స్టార్‌

Update: 2020-12-16 23:30 GMT
తమిళ సూపర్‌ స్టార్‌ గత కొన్నాళ్లుగా ఏడాదికి రెండు సినిమాలను విడుదల చేస్తూ కెరీర్‌ లో దూసుకు పోతున్నాడు. ఈ  ఏడాది కూడా ఆయన నుండి రెండు సినిమాలు ఖచ్చితంగా వస్తాయని అంతా ఆశించారు. మాస్టర్‌ సినిమాతో ఈ ఏడాది ఆరంభంలోనే విజయ్ రావాల్సి ఉంది. కాని కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను విడుదల చేయాలని భావించారు. కాని కరోనా పరిస్థితుల నేపథ్యంలో అసలు థియేటర్లు ఓపెన్‌ అవ్వడం లేదు. ఈ కారణంగా వచ్చే ఏడాది ఆరంభంలో సినిమాను విడుదల చేయబోతున్నారు.

మాస్టర్‌ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేయబోతున్నారు. మరో వైపు నెల్సన్‌ దిలీప్‌ దర్శకత్వంలో సినిమాను విజయ్‌ చేస్తున్నాడు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను సన్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. 2020 ను మిస్‌ చేసుకున్న విజయ్‌ 2021లో ఖచ్చితంగా రెండు సినిమాలను విడుదలకు ఇప్పటి నుండే ప్లాన్‌ చేస్తున్నాడు. వచ్చే ఏడాదిలో మాస్టర్‌ సినిమాతో పాటు నెల్సన్‌ దిలీప్ దర్శకత్వంలో సినిమాతో రాబోతున్న విజయ్‌ కాలం కలిసి వస్తే మరో సినిమాను కూడా విడుదల చేస్తాడేమో చూడాలి.
Tags:    

Similar News