మోస్ట్ అవైటెడ్ జాబితాలోని పుష్ప- ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ 2 ఇప్పటికే విడుదలై సంచలన విజయాలు సాధించాయి. ఇక మెగాభిమానుల మోస్ట్ అవైటెడ్ జాబితాలోంచి బాణం దూసుకొస్తోంది. ఫ్యాన్స్ సహా చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్టీస్టారర్ 'ఆచార్య' ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారం అంతంత మాత్రంగానే ఉందన్న ప్రచారం నడుమ.. ఇటీవల కొత్త పాటతో విపరీతమైన హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
కొరటాల శివ ఇటీవల ప్రచార ఇంటర్వ్యూలతో బిజీ అయ్యారు. ఒక చిట్ చాట్ లో ఆచార్య చిత్రం గురించి ఒక ప్రత్యేక రూమర్ పై స్పందించాడు. రీ-షూట్ లలో టీమ్ మునిగిపోయిందని అందుకే ఆలస్యమైందని కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి.
అయితే ఈ పుకార్లపై కొరటాల శివ ఘాటుగా స్పందించారు.ఇప్పటి వరకు తన సినిమాలేవీ రీ-షూట్ చేయలేదని చెప్పాడు. ఆచార్య పై అదంతా అసత్య ప్రచారమని ఖండించారు.
ఆచార్య లో మెగాస్టార్ చిరంజీవితో పాటు.. రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. చరణ్ ఏకంగా 40 నిమిషాల పాటు అలరిస్తాడన్న టాక్ ఉంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. కాజల్- పూజా హెగ్డే కథానాయికలుగా నటించారు. దేవాదాయ శాఖ అవినీతి నక్సలిజం నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టించే చిత్రమిదన్న టాక్ ఉంది.
సైరా తర్వాత చిరు నటించిన ఆచార్య పాన్ ఇండియా కేటగిరీలో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆర్.ఆర్.ఆర్ స్టార్ చరణ్ నటించడంతో ఇప్పుడు హిందీ పరిశ్రమలోనూ అంతో ఇంతో బజ్ ఉంది.
హిందీ రైట్స్ ని భారీ ధరలకు విక్రయించనున్నారన్న టాక్ వినిపించింది. పెన్ స్టూడియోస్ జయంతి లాల్ గడ హిందీలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారని సమాచారం. ఆచార్య డబ్బింగ్ రైట్స్ కోసం అతడు ఏకంగా 26 కోట్లు వెచ్చించడం హాట్ టాపిక్ అయ్యింది.