దర్శకునిగా మారిన రచయితల లో కొరటాల శివ ముందు వరసలో ఉంటారు. బృందావనం, మున్నా మరియు బిందాస్ చిత్రాల తో రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ, 'మిర్చి' సినిమాతో దర్శకుడిగా అవతారమెత్తాడు. యుంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఒక్క విజయంతో టాలీవుడ్ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్న దర్శకుడు కొరటాల శివ, తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ మరియు భరత్ అనే నేను వంటి అద్భుతమైన చిత్రాలను అందించారు. కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా 'ఆచార్య' అనే సినిమా రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ లో హీరో రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సక్సెఫుల్ సినిమాల తో దూసుకుపోతున్న కొరటాల గురించి ఓక వార్త ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.
రచయితగా, దర్శడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొరటాల శివ ఇప్పుడు నిర్మాతగా కూడా మారబోతున్నారని సమాచారం. తాను ప్రొడ్యూసర్ గా వ్యవహరించే తొలి చిత్రం కోసం స్టార్ హీరో తో చర్చలు జరుపుతున్నట్లు టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఈ సినిమా కోసం ఒక బడా ప్రొడక్షన్ హౌస్ తో కలిసి పనిచేయబోతున్నారంట. వాస్తవానికి కొరటాల నిర్మాతగా మారబోతున్నాడనే న్యూస్ ఎప్పటి నుండో వినిపిస్తున్నదే. తన చిన్ననాటి స్నేహితుడు సుధాకర్ అనే వ్యక్తితో కలిసి సినిమాలు నిర్మించబోతున్నట్లు అప్పట్లో న్యూస్ బయటకి వచ్చింది. కాని వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. దర్శకులు నిర్మాతలుగా మారడం టాలీవుడ్ లో కొత్తేమీ కాదు. గతంలో చాలా మంది దర్శకులు నిర్మాతలుగా మారిన సందర్భాలున్నాయి. వాళ్లలో కొందరు చేతులు కాల్చుకోగా మరికొందరు సక్సెఫుల్ నిర్మాతలుగా నిలదొక్కుకున్నారు. కొరటాల ఎత్తబోయే ఈ కొత్త అవతారం లో కూడా విజయవంతమై మంచి సినిమాలు నిర్మించాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.