మెగా కాంపౌండ్‌ పై కొరటాల అసంతృప్తి?

Update: 2020-06-18 08:50 GMT
మూడు నెలల తర్వాత షూటింగ్స్‌ కు ప్రభుత్వం అనుమతించిన నేపథ్యంలో కొందరు వెంటనే షూటింగ్‌ కు రెడీ అవుతున్నారు. మరికొందరు ఇప్పట్లో షూటింగ్స్‌ కు వెళ్లకుంటేనే మంచిది అనే అభిప్రాయంతో ఉన్నారు. ఈ నెలలో కాకున్నా వచ్చే నెల నుండి అయినా పెద్ద సినిమాల షూటింగ్స్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి 152వ చిత్రం ఆచార్య ను కూడా వచ్చే నెలలో షూటింగ్‌ ప్రారంభించాలని కొరటాల భావించాడు. కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో షూటింగ్‌ వద్దంటూ చిరంజీవి మరియు చరణ్‌ లు తేల్చి చెప్పారట.

దర్శకుడు కొరటాల శివ భరత్‌ అనే నేను చిత్రం విడుదల అయ్యి చాలా కాలం అయ్యింది. సూపర్‌ హిట్‌ తర్వాత వెంటనే సినిమా చేయాలనుకున్నా కూడా చిరంజీవితో సినిమాకు కమిట్‌ అవ్వడంతో కొరటాల మరో సినిమాను చేయలేక పోయాడు. సైరా నరసింహారెడ్డి చిత్రం కారణంగా ఆచార్య చిత్రం చాలా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది అనుకుంటున్న సమయంలో ఈ మహమామ్మరి వైరస్‌ వచ్చి మళ్లీ కొరటాలను వెయిటింగ్‌ లో పెట్టింది.

ఈ సమయంలో కూడా షూటింగ్స్‌ కు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో చకచక ఆచార్య షూటింగ్‌ ను పూర్తి చేసి కొత్త ప్రాజెక్ట్‌ ను వచ్చే ఏడాది మొదలు పెట్టి విడుదల చేయాలనుకున్న కొరటాల ప్లాన్‌ చేసుకున్నాడు. కాని ఇప్పట్లో ఆచార్య చిత్రం షూటింగ్‌ కు వచ్చే ఉద్దేశ్యంలో చిరంజీవి లేనట్లుగా తెలుస్తోంది. పాజిటివ్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యం దృష్ట్యా కొంత కాలం వరకు షూటింగ్‌ ను ఆపాలంటూ కొరటాలకు సూచించారట. దాంతో చిరు చరణ్‌ లపై కొరటాల అసంతృప్తితో ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆచార్య చిత్రం వచ్చే ఏడాది వరకు పూర్తి అయ్యే పరిస్థితులు లేకపోవడంతో కొరటాల కొత్త సినిమా ఎప్పటికి ప్రారంభం అయ్యేనో తెలియడం లేదు.
Tags:    

Similar News