గత ఏడు నెలలుగా కరోనా వైరస్ వరల్డ్ సినిమాని తీరని నష్టాల్లోకి నెట్టేసింది. దీని కారణంగా సినీ ఇండస్ట్రీ కంప్లీట్ గా క్లోజ్ అయిపోయింది. థియేటర్లు తెరిచే పరిస్థితిలేదు. షూటింగ్ లు చేయాలంటే వైరస్ భయం.. లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన నష్టాలని పూడ్చుకోవడం కోసం ఫిల్మ్ మేకర్స్ కొత్త దారులు వెతుకుతున్నారు. చాలా మంది నష్టాలని భరించలేక.. థియేటర్లు ఓపెన్ అయ్యేంత వరకు వేచి చూడలేక ఓటీటీలకు తమ చిత్రాలని అమ్మేశారు.
తాజా పరిస్థితుల నేపథ్యంలో కొన్ని క్రేజీ చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ కి వెళ్లాలా లేక ఓటీటీకి వెళ్లాలా అని నిర్మాతలు ప్రస్తుతం సదిగ్ధావస్థలో వున్నారు. క్రాక్, ... రంగ్ దే చిత్రాల షూటింగ్స్ చివరి దశకు చేరుకున్నాయి. ఈ మూవీస్ తో పాటు మరికొన్ని చిత్రాలు కూడా రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాల నిర్మాతలు తమ చిత్రాలని ఓటీటీకి ఇళ్లలేక థియేటర్ల కోసం ఆగలేక నరకం చూస్తున్నారు. రిలీజ్ కి రెడీ అవుతున్న చిత్రాల్లో క్రాక్, .. రంగ్ దే ముందు వరుసలో వున్నాయి. వీటి రిలీజ్ విషయంలో నిర్మాతలకు ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు.
వీళ్లలో చాలా మంది థియేట్రికల్ రిలీజ్ కి రెడీగా లేరు. కారణంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తే డిస్ట్రీబ్యూటర్స్ అడ్వాన్స్ లు ఇచ్చే పరిస్థితి లేదు. థియేటర్ కి ప్రేక్షకులు వస్తేనే వసూళ్లు లభిస్తాయి. లేని పక్షంలో డిస్ట్రీబ్యూటర్లు నష్టపోయే ప్రమాదం వుంది కాబట్టి డిస్ట్రీబ్యూటర్లు కొత్త చిత్రాల రిలీజ్ కి ముందుకు రావడం లేదు. పోనీ నిర్మాతలే స్వయంగా రిలీజ్ చేసుకోవాలని ప్రయత్నించినా భారీ స్థాయిలో నష్టాలని చవిచూడాల్సి వస్తుంది. ఆ రిస్క్ అవసరమా అన్నది మెజారిటీ నిర్మాతల వాదన. ఇదిలా వుంటే జీ 5 రాంగ్ దే అండ్ క్రాక్ చిత్రాలకు భారీ ఆఫర్లిచ్చింది. సాయి ధరం తేజ్ `సోలో బ్రాతుకే సో బెటర్` చిత్రాన్ని జీ 5 కి అమ్మేస్తున్నారు. దీనితో పాటు థియేట్రికల్ రిలీజ్ కూడా చేయబోతున్నారు. దీంతో చాలా మంది నిర్మాతల్లో థియేట్రికల్ రిలీజ్ పై స్పష్టత రావడం లేదు. డిసెంబర్ నుంచి ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం వుంది.