ఓల్డ్ సిటీ లో క్రాక్ చూపిస్తున్న రాజా

Update: 2019-12-18 04:42 GMT
మాస్ మ‌హారాజ్ ర‌వితేజ ఏం చేసినా సంథింగ్ స్పెష‌ల్ గానే ఉంటుంది. ఇప్ప‌టికిప్పుడు వ‌రుస‌గా రెండు క్రేజీ చిత్రాల్లో న‌టిస్తున్నాడు. ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా?  ఫేం వీ.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న డిస్కోరాజా చిత్రంలో న‌టిస్తున్న ర‌వితేజ .. ఇటీవ‌లే గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో క్రాక్ చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించారు. ఓవైపు డిస్కోరాజా నిర్మాణానంత‌ర ప‌నులు పూర్తి చేస్తూనే.. ప్ర‌స్తుతం సెట్స్ పై ఉన్న క్రాక్ కోసం రాజా చాలానే శ్ర‌మిస్తున్నార‌ట‌.

డాన్ శీను- బ‌లుపు లాంటి హిట్ చిత్రాల్ని త‌న కెరీర్ కి అందించిన గోపిచంద్ మ‌లినేని ఈసారి మాస్ రాజా కోసం ఓ రియ‌లిస్టిక్ క‌థాంశాన్ని ఎంచుకున్నారు. వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా క్రాక్ స్క్రిప్టును రాసుకున్నారు. ఇక ర‌వితేజ త‌న కెరీర్ లో మ‌రోసారి పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. క్రాక్ అన్న టైటిల్ కి త‌గ్గ‌ట్టే క్రాక్ పోలీస్ గా ఇర‌గ‌దీస్తాడ‌ని చెబుతున్నారు. రియ‌ల్ ఇన్సిడెంట్ అన్నారు కాబట్టి.. హ‌త్యా చారం నేప‌థ్య‌మా? అంటూ ఇప్ప‌టికే ఫిలింస‌ర్కిల్స్ లో వాడి వేడిగా చ‌ర్చ సాగుతోంది. అయితే గోపిచంద్ మ‌లినేని దీనిపై వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుంది.

ప్ర‌స్తుతం హైద‌రాబాద్ పాత బ‌స్తీలో రాత్రి ఎఫెక్ట్ లో ఓ భారీ ఫైట్ సీన్ తెర‌కెక్కిస్తున్నార‌ని తెలుస్తోంది.  స్టంట్ కొరియోగ్రఫర్స్ రామ్- లక్ష్మణ్ ఈ ఫైట్ ని తెర‌కెక్కిస్తున్నారు. కొంత గ్యాప్ త‌ర్వాత ఈ చిత్రంతో శ్రుతిహాస‌న్ తిరిగి టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్ కుమార్ మ‌రో కీల‌క పాత్ర‌ను పోషిస్తోంది. వ‌ర‌ల‌క్ష్మి ఇందులో పందెంకోడి త‌ర‌హాలో విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌బోతోంద‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక ఇదే చిత్రంలో `అల‌.. వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలో విల‌న్ గా న‌టిస్తున్న స‌ముథిర‌క‌ని ఓ కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు.
Tags:    

Similar News