బాలనటుడిగా తెరంగేట్రం చేసినప్పటి నుంచి బాలకృష్ణ పేరు ముందు నందమూరి అనే పదం లేకుండా ఏ సినిమాలోనూ టైటిల్స్ పడలేదు. బాలయ్యకు ‘యువరత్న’ లాంటి బిరుదులు జోడించినా.. నందమూరి అనే ఇంటి పేరు మాత్రం ఎన్నడూ మిస్సయింది లేదు. కానీ తొలిసారి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ పోస్టర్లలో మాత్రం బాలయ్య పేరు ముందు ‘నందమూరి’ కనిపించలేదు. ఈ సినిమా టైటిల్లో శాతకర్ణి పేరు ముందు అతడి తల్లి పేరును కలిపినట్లే బాలయ్యకు కూడా పోస్టర్లో ఆయన తల్లి పేరు కలిపి బసవతారకపుత్ర బాలకృష్ణ అనే వేశారు. ఐతే ఈ సినిమా రిలీజ్ టైంలో కూడా మార్పేమీ ఉండదని.. బాలయ్య కెరీర్లో తొలిసారిగా ఆయన పేరు లేకుండానే సినిమా టైటిల్స్ పడబోతున్నాయని క్రిష్ తేల్చేశాడు.
‘‘పూర్వకాలం నుంచి వ్యక్తుల పేర్ల ముందు వాళ్ల తండ్రి పేరు మాత్రమే ఉండేది. ఐతే పితృస్వామ్యపు రోజుల్లోనే మొట్ట మొదట తల్లి పేరైన ‘గౌతమి’ని తన ఇంటి పేరుగా మార్చుకున్న రాజు శాతకర్ణి. అందుకే ఆయన పేరు గౌతమీపుత్ర శాతకర్ణి అయింది. ఆ నియమాన్ని పాటిస్తూ బాలయ్య పేరును ‘బసవరామతారకపుత్ర బాలకృష్ణ’ అని వేశాం. దీంతో పాటు సినిమా యూనిట్లోని అందరి పేర్ల ముందు తల్లిపేరునే జోడించాం. నా పేరు కూడా ‘అంజనా పుత్ర క్రిష్’ అని ఉంటుంది. ఒక కొడుకు తండ్రికన్నా గొప్పవాడు కాగలడు కానీ.. తల్లి కన్నా గొప్పవాడు కాలేడు. అందుకే తల్లిని గౌరవిస్తూ మేమందరం మా పేర్ల వెనుక వాళ్ల పేర్లను జోడించాం. ఇది మా తల్లులకు ఇచ్చే గౌరవం’’ అని క్రిష్ తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/