సౌత్ స్టార్ కిడ్స్ మీడియాకు దూరంగా ఉంటారు. కాని బాలీవుడ్ స్టార్ కిడ్స్ మాత్రం చిన్నప్పటి నుండే మీడియాలో కనిపిస్తూ ఉంటారు. కొందరు స్టార్స్ కిడ్స్ ప్రేమ వ్యవహారాలు గతంలో నెట్టింట హల్ చల్ చేశాయి. కనీసం ఒక్క సినిమా కూడా చేయకుండానే ఎంతో మంది స్టార్ కిడ్స్ తమ ప్రేమ వ్యవహారాలు లేదా లైఫ్ స్టైల్ కారణంగా ఎంతో ఫేమస్ అయ్యారు. అలాగే బాలీవుడ్ స్టార్ జాకీ ష్రాఫ్ కుమార్తె కృష్ణా ష్రాఫ్ కూడా తన ప్రేమ కథ మరియు హాట్ ఫొటోలు మరియు వీడియోల వల్ల చాలా ఫేమస్ అయ్యింది. ఒక హీరోయిన్ ను మించి ఆమెను నెట్టింట ఫాలో అవుతున్నారు.
20 ఏళ్ల వయసులోనే ప్రేమలో పడ్డ కృష్ణా ష్రాఫ్ తన తండ్రి సోదరుడి దారిలో కాకుండా తనకంటూ కొత్త దారిని ఎంచుకుంది. తన కుటుంబం 18 ఏళ్ల వయసు వచ్చినప్పటి నుండే దూరంగా ఉంటూ వచ్చిన కృష్ణా ష్రాఫ్ కొన్నాళ్ల క్రితం ప్రియుడికి బ్రేకప్ చెప్పింది. మూడు సంవత్సరాల పాటు సహజీవనం సాగించినట్లుగా చెప్పిన ఈ అమ్మడు అతడితో బ్రేకప్ వల్ల జీవితాంతం గుర్తుండి పోయే గుణపాఠం నేర్చుకున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇటీవల ఆమె చేసిన ఒక మ్యూజిక్ వీడియోలో నటించింది. ఆ వీడియో ను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సందర్బంగా మీడియాతో చిట్ చాట్ నిర్వహించింది.
కృష్ణా ష్రాఫ్ మాట్లాడుతూ.. నాతో చిన్నప్పటి నుండి పెరిగిన వ్యక్తితో ప్రేమలో పడ్డాను. మూడు సంవత్సరాలు ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని చుట్టేశాం. కలిసి పని చేశాం.. కలిసి ప్రపంచాన్ని చూశాం. కొన్ని విభేదాల కారణంగా సామరస్యంగానే విడిపోయాం. చిన్నప్పటి నుండి స్నేహితులం కనుక ఇద్దరం కూడా సామరస్యంగానే విడిపోయినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. మళ్లీ ప్రేమలో పడతారా అనే ప్రశ్నకు బ్రేకప్ వల్ల చాలా గుణపాఠాలు నేర్చుకున్నాను. కనుక ఇప్పట్లో నేను ప్రేమలో పడుతాను అనుకోవడం లేదు అంది.